Movies ' పుష్ప 2 ' ఓ సంచ‌ల‌నం... ఓ అసాధార‌ణం... బ‌న్నీ...

 ‘ పుష్ప 2 ‘ ఓ సంచ‌ల‌నం… ఓ అసాధార‌ణం… బ‌న్నీ క్రేజ్ ఓ శిఖ‌రం…!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప‌. పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో బంపర్ బ్లాక్ బస్టర్ అయిన పుష్ప అదిరిపోయే కలెక్షన్లు రాబట్టింది. దీంతో ఇప్పుడు సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు ఉన్న భారీ రిలీజ్ బిజినెస్ నేపథ్యంలో రికార్డులు బ్రేక్ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ఏకంగా రు. 1000 కోట్లు దాటేసింది. ఈ సినిమాకు ఏకంగా 1065 కోట్ల బిజినెస్ జరిగినట్టు సమాచారం బయటకు వచ్చింది.

Pushpa 2 The Rule Team Planning To Release New Teaser | cinejosh.com

థియేటర్ – ఓటిటి – డిజిటల్ స్ట్రీమింగ్ మ్యూజికల్ శాటిలైట్ కలిపి ఈ స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. పుష్ప‌ పార్ట్ 2 సినిమా ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు ఏకంగా రు. 220 కోట్లకు అమ్ముడుపోయాయట. నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులు రు. 200 కోట్లు అమ్మారట. తమిళనాడులో రు. 50 కోట్లు – కర్ణాటకలో రు. 30 కోట్లు – కేరళలో రు. 20 కోట్లు ద్వారా బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఓవర్సీస్ థియేటర్ హక్కులు రు. 120 కోట్లు అయ్యాయి.

Pushpa 2: Rashmika Mandanna To Die In Allu Arjun Starrer Film? Viral Photo  Leaks Spoiler - News18

ఇలా మొత్తంగా పుష్ప 2 సినిమాకు థియేటర్ హక్కుల ద్వారానే రు. 640 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇందుకోసం ఏకంగా రు. 275 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. మ్యూజిక్ హక్కులు రు. 65 కోట్లు – శాటిలైట్ హక్కులు రు. 85 కోట్లకు అమ్మారు. ఇలా అన్నీ కలిపితే పుష్ప 2 సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ రు. 65 కోట్ల రేంజ్ లో జరిగినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ సినిమా తర్వాత బన్నీ క్రేజ్ భారతదేశ సినీ చరిత్రలో శిఖరాగ్రాన ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news