ఒక స్టార్ హీరో నటిస్తున్నా రెండు సినిమాలు ఒకేసారి నిర్మాణంలో ఉన్నప్పుడు వాటి తాలూకు అప్డేట్స్ ఎవరూ ఇవ్వాలనేది అనేది అవి వాటి రిలీజ్ డేట్ ల మీద ఆధారపడి ఉంటుంది. రెగ్యులర్ గా సినిమాలు చేసే వాళ్లకు ఇది వస్తుంది కానీ పవన్ తీరు వేరు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్నాక పెండింగ్లో ఉన్న సినిమాలను పూర్తి చేసే విషయంలో సమన్యాయం చేయాలనినే ఉద్దేశంతో తన సినిమాలకు సమానంగా డేట్లు ఇచ్చారనే విషయం తెలిసిందే. ఇక మొదటి ప్రాధాన్యత హరిహర వీరమల్లుకి ఉంది .. ఇప్పటికే మార్చ్ 28న రిలీజ్ చేస్తున్నట్టు డేట్ ని కూడా ప్రకటించారు. కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వటం న్యాయం సముచితం.
ఇక అలా అని ఓ జి టిమ్ మౌనంగా లేదు క్రమం తప్పకుండా ఫ్రాన్స్ తో టచ్ లో ఉంటూ ఇప్పటికే ఫోటోల రూపంలో అంచనాలు పెంచే పనిలో బిజీగా ఉంది. నిన్న హఠాత్తుగా ఊహించని విధంగా డివివి సంస్థ ఎక్స్ హ్యాండిల్ ని కొత్త హెడర్ తో అప్డేట్ చేయడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ యాక్టివ్ అయిపోయారు. ఇక దీంతో వీరమల్లు బృందం రంగంలోకి దిగి తమ వైపు నుంచి ఒక కంటెంట్ వదిలేలా చూసుకుంది.. ఏది బాగుంది ఏది బాలేదు అనేది పక్కన పెడితే ఒక దాని మీదే అటెన్షన్ ఉండేలా ప్రమోషన్ చేస్తే బాగుంటుందనేది అధిక శాతం అభిమానులు అభిప్రాయం నిజానికి వీరమల్లు పెట్టిన బడ్జెట్ కి తగ్గ హైప్ బయట లేదు.
ఓజీ ఎప్పుడు పూర్తి అయిన రిలీజ్ డేట్ మాత్రం హరిహర వీరమల్లు తర్వాత కనీసం నాలుగైదు నెలల గ్యాప్ వచ్చేలా ఉంటుంది.. ఎక్కడ చూసినా ఓజీ ఫీవర్ జనాల్లో మామూలుగా లేదు. అందులో నటించిన వాళ్లు వేరే సినిమాల్లో ఇంటర్వ్యూలకు వచ్చినప్పుడు సైతం ఈ ప్రస్తావన లేకుండా యాంకర్లు ఉండలేకపోతున్నారు. ఇదంతా చూస్తుంటే పవన్ వర్సెస్ పవన్ అనిపిస్తోంది కదూ. బ్యాలన్స్ షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిన వీరమల్లు ఫస్ట్ కాపీని డిసెంబర్ కల్లా సిద్ధం చేయాలని నిర్మాత ఏఎం రత్నం పట్టుదలతో ఉన్నారు. రెండు భాగాలు కాబట్టి సీక్వెల్ ఎంత శాతం చిత్రీకరణ చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది.