Moviesబాలయ్యతో మరోసారి చంద్రబాబు.. ఈసారి గట్టిగానే ప్లాన్ చేశారుగా బాక్సులు పగిలి...

బాలయ్యతో మరోసారి చంద్రబాబు.. ఈసారి గట్టిగానే ప్లాన్ చేశారుగా బాక్సులు పగిలి పోవాల్సిందే..!

నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా అన్ స్టాపబుల్ సీజన్ 4 కు రంగం సిద్ధమైంది. తొలి ఎపిసోడ్లో మరోసారి బాలయ్య, బావ‌ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సందడి చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పటికీ ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలైంది.. ఈ కార్యక్రమంలో బాలయ్య – చంద్రబాబు పాల్గొన్నారు. ఇక చంద్రబాబు అన్‏స్టాపబుల్ షోకు రావడం ఇది రెండోసారి గతంలో ప్రతిపక్ష నేతగా ఉండగా 2022లో ఈ షోకు గెస్ట్ గా వచ్చారు.. అప్పుడు ఆయనతో పాటు లోకేష్ కూడా వచ్చారు. ఇక మళ్ళీ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి అన్‏స్టాపబుల్ లో సుందర చేయడానికి రెడీ అయ్యారు.Unstoppable Season 4: బాలయ్య అన్‌స్టాపబుల్‌లో మళ్లీ చంద్రబాబు.. ఈసారి ఏం  చెప్పబోతున్నారంటే? - Telugu News | NBK's Unstoppable Season 4 Starts with AP  CM Chandra Babu Naidu | TV9 Teluguఅయితే ఇప్పుడు ఎన్నికల ముందు, తర్వాత చోటు చేసుకున్న పలు కీలక అంశాలను చంద్రబాబు, బాలయ్యతో పంచుకోబోతున్నారని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన జైల్లో ఉన్న సమయంలో ఎదురైన ఘ‌ట‌న‌ల‌ను చంద్ర‌బాబు బాలయ్యతో పంచుకుంటారని కూడా అంటున్నారు. అలాగే స్ప‌ష‌ల్‌ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ కూడా మధ్యలో రావొచ్చని కూడా అంటున్నారు. గతంలో చంద్రబాబు వచ్చినప్పుడు లోకేష్ కూడా మధ్యలో ఎంట్రీ ఇచ్చి షోని రత్తోకట్టించాడు. ఇప్పుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా షో మధ్యలో ఎంట్రీ ఇస్తారని కూడా అంటున్నారు.Unstoppable Season 4: బాలయ్య అన్‌స్టాపబుల్‌లో మళ్లీ చంద్రబాబు.. ఈసారి ఏం  చెప్పబోతున్నారంటే? - Telugu News | NBK's Unstoppable Season 4 Starts with  AP CM Chandra Babu Naidu | TV9 Teluguఇక గతంలో జరిగిన షోలో చంద్రబాబు బాల‌య్య‌తో 1990 సంక్షోభం, పార్టీని తన చేతిలోకి తీసుకోవటం ఎన్టీఆర్ మరణం గురించి చెప్పుకొచ్చారు. అది టిడిపి గెలుపుకు మంచి ఊపునిచ్చింది. ఇప్పుడు అధికారులోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఎలాంటి అంశాలు బాల‌య్య‌తో చర్చిస్తారని కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలయ్య కూడా తన బావ‌ని ఎలాంటి ఇర‌కాటంలో పెడతారని కూడా ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ కూడా దీపావళి కానుకగా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news