Movies' గేమ్ ఛేంజ‌ర్ ' ఓటీటీ డీల్ ఓవ‌ర్‌... చ‌ర‌ణ్ కెరీర్‌లో...

‘ గేమ్ ఛేంజ‌ర్ ‘ ఓటీటీ డీల్ ఓవ‌ర్‌… చ‌ర‌ణ్ కెరీర్‌లో క‌ళ్లు చెదిరే రేటు ఇది…!

టాలీవుడ్ గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజ‌ర్‌ శంకర్ దత్తతంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఈ సినిమా యూనిట్ బిజీగా ఉంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జనవరి 10న ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. రు.

Game Changer release date to be announced soon గేమ్ ఛేంజర్: ఈసారి పక్కా

300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ కీయారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. గతంలో రామ్ చరణ్ – కియారా అద్వాని కాంబినేషన్లో వినయ విధేయ‌ రామ సినిమా వచ్చింది. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తుండగా తాజాగా ఈ సినిమా ఓటిటి రైట్స్ డీల్ గురించి టాలీవుడ్ వర్గాల్లో అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. గేమ్ ఛేంజ‌ర్‌ సినిమాపై నెలకొన్న భారీ హైప్ కారణంగా ఈ సినిమా ఓటిటి రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైనట్టు తెలుస్తోంది.

Game Changer: ఒక్క అప్‌డేట్ ప్లీజ్.. ఒకేఒక్క అప్‌డేట్ ప్లీజ్.. అంటున్న  చెర్రీ ఫ్యాన్స్.! - Telugu News | Mega Fans Request Ram charan for update  from Game Changer due to devara effect Telugu ...

ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ సొంతం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది రామ్ చరణ్ కెరీర్ లోనే హైయెస్ట్ డీల్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే రామ్ చ‌ర‌ణ్ ఉప్పెన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతాడు. మైత్రీ మూవీస్ వాళ్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news