Movies' అఖండ 2 ' ... బోయ‌పాటి చుట్టూ బోర్డ‌ర్ గీసిన...

‘ అఖండ 2 ‘ … బోయ‌పాటి చుట్టూ బోర్డ‌ర్ గీసిన బాల‌య్య‌.. తేజ‌స్విని..!

ప్రస్తుత సినిమా యుగంలో కమర్షియల్ దర్శకులుగా నిలదొక్కుకోవటం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఒకప్పుడు ఈ ఫార్మాట్లో హిట్లు కాకపోయినా నష్టాలు రాకుండా సేప్ అయ్యారు.. కానీ ఇప్పుడు కాస్త తేడా కొడితే దారుణమైన నష్టాలు వస్తున్నాయి. బిగోపాల్ – వినాయక్ లాంటి వాళ్ళు నేటితరం మాస్ ఆడియన్స్ అంచనాలు అందుకోలేక సైలెంట్ అయిపోయారు. అయితే ఇదే ట్రాక్ లో పెడుతూ సక్సెస్ అవుతున్నారు బోయపాటి శ్రీను. బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్ అనగానే అంచనాల మామూలుగా ఉండటం లేదు. బోయపాటికి ఇతర హీరోలతో ఒకటి రెండు ప్లాపులు పడినా బాలయ్యతో మూడు సినిమాలు చేస్తే మూడు సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. దీంతో ఇప్పుడు వీరి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్‌గా అఖండ 2 తెరకెక్కుతుంది.

అఖండ 2.. బోయపాటి ఏమన్నారంటే.. | Boyapati Akhanda 2 Sequeal waiting for that  movie

అఖండ 2 పై అంచనాలు మామూలుగా లేవు. బోయపాటి కెరీర్ మొదటి నుంచి బడ్జెట్ విషయంలో ట్విస్టులు ఇస్తారని టాక్ ఉంది. ఫర్ఫెక్షన్ కోసం యాక్షన్ సీక్వెన్స్ కోసం బోయపాటి భారీగా ఖర్చు పెట్టిస్తారు. అందుకే ప్రతిసారి రెమ్యూనరేషన్ లో కోతలు కూడా ఎదుర్కొన్నారు. నిర్మాతలతో గొడవ పడలేక సినిమా అవుట్ ఫుట్ బాగుండాలి అని బోయపాటి తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అఖండ టైంలో అసలు రెమ్యూనరేషన్ లేకుండా ప్రాఫిట్ లో షేర్ మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఈ సినిమా కూడా అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువ అయింది. అయితే సినిమా సూపర్ హిట్ కావడంతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు.

Akhanda 2 Cast and Crew Details 'అఖండ - 2' క్యాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ -  ట్రాక్‌టాలీవుడ్

ఇప్పుడు అఖండ 2 తాండవం కోసం ఏకంగా రు. 100 కోట్ల ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య కెరీర్‌లో కూడా ఇదే హైయెస్ట్ బడ్జెట్. ఈసారైనా బోయపాటి అనుకున్న బడ్జెట్లో రు. 100 కోట్లతో సినిమా ఫినిష్ చేస్తారా లేదా అన్నది అసలు ప్రశ్న. ప్రతిసారి ఒక బడ్జెట్ అనుకుంటే దానిపై ఎంతో కొంత పెరుగుతుంది. ఈసారి అలాంటి సమస్య లేకుండా బాలయ్య కూడా ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తోంది. అందుకే తన రెండవ కుమార్తె నందమూరి తేజస్విని సమర్పణలో ఈ సినిమా వస్తుంది కాబట్టి ముందుగానే బడ్జెట్ హద్దులు దాటకుండా ఓ లైన్ అయితే గీసారని తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news