Moviesబాల‌య్య స్టార్ హీరో కావ‌డానికి ఆమె జాత‌కానికి అంత లింక్ ఉందా..?

బాల‌య్య స్టార్ హీరో కావ‌డానికి ఆమె జాత‌కానికి అంత లింక్ ఉందా..?

టాలీవుడ్ లో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హవా నడుస్తోంది. బాలయ్య పట్టిందల్లా బంగారం అవుతుంది. బాలయ్య నటించిన చివరి మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి సినిమాలు సూపర్ డూపర్ హిట్. ప్రస్తుతం బాలయ్య.. బాబి దర్శకత్వంలో తన 109వ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే బోయపాటి శ్రీనుతో అఖండ 2 కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు అఖండ 2 సినిమా కూడా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఇదిలా ఉంటే.. బాలయ్య స్టార్ హీరో కావడానికి బాలయ్య పెద్ద కుమార్తె బ్రాహ్మణి జాతకమే కారణమట.

నారా బ్రాహ్మణి క్లాప్‌తో బాలకృష్ణ అఖండ-2 తాండవం ప్రారంభం

ఆమె పుట్టిన తర్వాత బాలయ్యకు కెరీర్ పరంగా ఎంతో కలిసి వచ్చిందని.. నందమూరి కుటుంబంలో భావిస్తారు. డిసెంబర్ 21, 1988లో బ్రాహ్మణి జన్మించిగా.. బ్రాహ్మణి పుట్టిన తర్వాత బాలయ్య నటించిన.. విడుదలైన భలే దొంగ హిట్ అయింది. ఆ తర్వాత ముద్దుల మామయ్య ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బాలగోపాలుడు యావరేజ్ అయినా… నారీ నారీ నడుమ మురారితో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఆ టైంలో బాలయ్య నటించిన కొన్ని సినిమాలు ప్లాప్ అయినా కూడా.. బాలయ్య కెరీర్ పై ఏమాత్రం ప్రభావం చూపలేదు.

Akhanda 2 : అప్పుడే 'అఖండ 2' టైటిల్ థీమ్ కూడా రిలీజ్.. తమన్ తాండవం  అదిరిందిగా.. | Balakrishna boyapati sreenu akhanda 2 title theme video  released thaman bgm goosebumps-10TV Telugu

తర్వాత రోజుల్లో బాలయ్య వరుసగా లారీ డ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలతో తన రేంజ్ అమాంతం పెంచుకున్నారు. బ్రాహ్మ‌ణి జాతకం నిజంగా మంచి జాతకమని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఆమె వ్యాపార రంగంలో సైతం సంచలన విజయాలను సొంతం చేసుకున్నారు. ఇక తన పెద్ద కుమార్తె బ్రాహ్మణీకి బాలయ్య తన మేనల్లుడు అయిన నారా లోకేష్‌ను ఇచ్చి 2000 వివాహం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నారా లోకేష్.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగాను.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా.. ఉన్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news