Moviesమెగా ఫ్యామిలీ గొడ‌వ‌లు... పుండుపై కారం చ‌ల్లే ప‌ని చేస్తోన్న అల్లు...

మెగా ఫ్యామిలీ గొడ‌వ‌లు… పుండుపై కారం చ‌ల్లే ప‌ని చేస్తోన్న అల్లు అర‌వింద్‌..?

అసలే మెగా ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయి .. మెగా కాంపౌండ్ కు … అల్లు అరవింద్ కాంపౌండ్ కు కాస్త గ్యాప్ ఉందన్న ప్రచారం నడుస్తోంది. దీనికి తోడు బన్నీ చేష్టలు … బన్నీ మాటలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. కావాలని బన్నీ రెచ్చగొడుతున్నాడా ? అన్న సందేహాలు ఉన్నాయి .. అభిమానులు కూడా మెగా అభిమానులు వేరు … అల్లు ఫ్యామిలీ అభిమానులు వేరు అన్నట్టుగా చీలిపోయారు. ఇలాంటి టైములో ఉన్న గొడవలపై … అల్లు అరవింద్‌ కారం చ‌ల్లుతున్నారా ? అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.Game Changer: Ram Charan, Shankar film gears up for second single release  "Telugu Movies, Music, Reviews and Latest News"అసలు విషయంలోకి వెళితే వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే తన కొడుకు గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా కోసం చిరంజీవి తన విశ్వంభర సినిమాను సమ్మర్ కు పోస్ట్ చేసుకున్నారు. శంకర్ ప్రతిష్టాత్మకంగా గేమ్ ఛేంజ‌ర్‌ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతికి ఇలా మెగా ఫ్యామిలీ నుంచి ఒక సినిమా షెడ్యూల్ అయింది. ఇక బాలయ్య 109 సినిమా ఉండనే ఉంది. ఇదే టైంలో నాగచైతన్య – సాయి పల్లవి తండేల్‌ సినిమా కూడా సంక్రాంతి బరిలోకి దిగుతుందని ప్రచారం జరుగుతుంది.Naga Chaitanya: 'తండేల్' నుంచి నాగచైతన్య ఫోటో లీక్.. ఊరమాస్ గెటప్‏లో చైతూ  లుక్ అదుర్స్.. - Telugu News | Naga Chaitanya's Mass look photo leaked from  Thandel movie telugu cinema news | TV9 Teluguఇలా చేస్తే రాంచరణ్ గేమ్ ఛేంజ‌ర్‌ సినిమాకు పోటీగా గీతా కాంపౌండ్ సినిమా విడుదల చేసినట్టు అవుతుంది. ఎప్పుడైతే గీతా కాంపౌండ్ కు … మెగా కాంపౌండ్ కు అంతగా పొసగ‌టం లేదన్న పుకార్లు ఉన్నాయి. ఇప్పుడు అల్లు అరవింద్ త‌న బ్యాన‌ర్లో వ‌స్తోన్న తండేల్‌ సినిమాను సంక్రాంతి బ‌రిలో దింపితే ఈ ఊహాగానాలు మరింత బలపడతాయి. మరి అరవింద్ ఇలా ఎందుకు చేస్తున్నారు అన్నది ఎవరికీ అంతుపట్ట‌టం లేదు. ప్రస్తుతం ఈ విషయం అయితే టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news