Movies2025 సంక్రాంతి : అక్కినేని VS నంద‌మూరి VS మెగా వార్‌...

2025 సంక్రాంతి : అక్కినేని VS నంద‌మూరి VS మెగా వార్‌ ఫిక్స్‌…!

టాలీవుడ్ లో దీపావళి పండుగ నేపథ్యంలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడేందుకు రెడీ అవుతున్నాయి. అయితే టాలీవుడ్ లో ఎప్పుడు అసలైన వార్‌ మాత్రం సంక్రాంతి సీజన్ లో జరుగుతుంది. ఇప్పటికే సంక్రాంతి రేసులో పలు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. మరికొన్ని సినిమాలు ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే సంక్రాంతి బ‌రిలో హాట్‌ ఫేవరెట్ గా నిలుస్తున్నాయి. ఈసారి సంక్రాంతికి కచ్చితంగా వస్తుందని అందరూ అనుకున్న మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర వాయిదా పడింది. సంక్రాంతి బరిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ఉండనుంది. దిల్ రాజు నిర్మాతగా దర్శుకుడు శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు..

NBK 109 Shooting Update : బాలయ్య NBK109 షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? |  Balakrishna director bobby nbk 109 movie shooting update-10TV Telugu

కీయారా అద్వానీ హీరోయిన్. ఇక దర్శకుడు బాబి డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ న‌టిస్తున్న బాలయ్య 109వ సినిమా కూడా సంక్రాంతి రేసులోనే బరిలో ఉంది. ఈ సినిమాపై కూడా మంచి అంచ‌నాలు ఉన్నాయి.
ఇప్పుడు సంక్రాంతి బరిలో నుంచి ఓ సినిమా తప్పుకుంటున్నట్లుగా సినీ సర్కిల్స్‌లో వార్తలు వ‌స్తున్నాయి. ఆ సినిమా ఏదో కాదు… అనిల్ రావిపూడి, వెంకీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా రిలీజ్ వాయిదా వేయ‌డం దాదాపు ఖ‌రారైందంటున్నారు. ఈ విష‌యంలో నిర్మాత‌ల‌కు.. ద‌ర్శ‌కుడు అనిల్‌కు మ‌ధ్య చిన్న‌పాటి గ్యాప్ కూడా వ‌చ్చిందంటున్నారు.

Game Changer: మెగా పవర్ స్టార్ గేమ్ ఛేంజర్ సినిమా నుంచి క్రేజీ అప్డేట్..  అదేంటంటే - Telugu News | Interesting update on Ram Charan Game Changer  Movie | TV9 Telugu

ఇదే నిజ‌మైతే మరో హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న ‘తండేల్’ మూవీకి ఇది అడ్వాంటేజ్‌గా మారనుంది. ఈ సినిమాను కూడా సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తామ‌ని నిర్మాత చెపుతున్నారు. అదే జ‌రిగితే అప్పుడు సంక్రాంతి బ‌రిలో మెగా హీరో గేమ్ ఛేంజ‌ర్‌- నంద‌మూరి హీరో బాల‌య్య సినిమా.. అక్కినేని హీరో చైతు తండేల్ సినిమాల మ‌ధ్య అదిరిపోయే ట్ర‌యాంగిల్ ఫైట్ ఉంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news