Moviesదుమ్ము లేప‌రా ' దేవ‌ర‌ ' .. ఆ రెండు ఏరియాల్లో...

దుమ్ము లేప‌రా ‘ దేవ‌ర‌ ‘ .. ఆ రెండు ఏరియాల్లో రోజు కోటి రూపాయ‌లు…!

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తర్కెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ దేవర. గత నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర జర్నీ స్టార్ట్ చేసి అనూహ్యంగా తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఎన్టీఆర్ కెరీర్ లోనే సోలో హీరోగా తిరుగులేని కలెక్షన్లు సొంతం చేసుకుంది. ఇప్పటికే పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్న దేవర సినిమా ఇప్పుడు మరో ఘనత సాధించింది. మరోసారి ఈ సినిమా పేరు ఎక్స్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. తాజాగా దేవర సినిమా రిలీజ్ అయి పద్దెనిమిది రోజులు పూర్తవుగా ఆంధ్రప్రదేశ్ – తెలంగాణలో ప్రతిరోజు కోటి రూపాయలు వసూలు చేస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.Devara - Part 1 (2024) - Movie | Reviews, Cast & Release Date - BookMyShowకోవిడ్ తర్వాత ఈ స్థాయిలో కలెక్షన్ రాబెట్టిన సినిమా దేవర కావటం విశేషం. సీడెడ్‌ ఏరియాలోను దేవ‌ర రు. 30 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పటివరకు కేవలం రాజమౌళి తెర‌కెక్కించిన సినిమాలు మాత్రమే అక్కడ ఈ ఘనత సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు రాజమౌళి కాకుండా మరోదర్శకుడు సినిమా ఈ స్థాయిలో వసూలు సాధించడం ఇదే తొలిసారి కావటం విశేషం. దీంతో సీడెడ్‌ ఏరియాలో 30 కోట్లు దాటిన రెండు సినిమాలు ఉన్న ఏకైక హీరోగా ఎన్టీఆర్ రికార్డుల్లోకి ఎక్కారు. ఎన్టీఆర్ అభిమానులు ఈ వార్తను షేర్ చేస్తూ ఉండడంతో దేవర ఇప్పుడు ఎక్స్‌లో ట్రెండింగ్ లో ఉంది.Devara X review Fans 'blown away' by Jr NTR's performance, but disappointed  by VFX - India Todayఇప్ప‌టి వ‌ర‌కు దేవ‌ర ప్ర‌పంచ వ్యాప్తంగా రు. 510 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాను కొస‌రాజు హ‌రి – మిక్కిలినేని సుధాక‌ర్ నిర్మించ‌గా… నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ స‌మ‌ర్పించారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా దేవ‌ర 2 కూడా ఉండ‌నుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news