MoviesNBK109 టైటిల్ ఫిక్స్‌... చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చారుగా...!

NBK109 టైటిల్ ఫిక్స్‌… చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చారుగా…!

నట‌సింహం.. గాడ్ ఆఫ్ మాసేస్ నందమూరి బాలకృష్ణ తాజాగా నటిస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాను ఎన్బీకే 109 అనే వర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్కిస్తున్నారు. వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత దర్శకుడు కేఎస్‌. రవీంద్ర ( బాబి ) దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇప్పటికే తన కెరీర్లో చాలా రోజుల తర్వాత మూడు వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాల‌తో మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ వెల్లడించారు.Akhanda Movie Review: Lion Roars in High Volumeఇక ఈ సినిమా టైటిల్.. టీజర్‌ను దీపావళి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు కూడా నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమాకు ఎలాంటి ? టైటిల్ పెడతారా అనే ఆసక్తి అభిమానుల‌లో నెలకొంది. ఈ సినిమా కోసం రెండు డిఫరెంట్ టైటిల్స్ మేకర్స్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం రెండు డిఫరెంట్ టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారట మేకర్స్. డాకూ మహారాజా – సర్కార్ సీతారామ్ అనే రెండు వెరైటీ టైటిల్స్ ప‌రిశీలిస్తుండ‌గా.. ఈ రెండిటిలో ఏదో ఒకటి పెట్టాలని చూస్తున్నారట.Akhanda Movie Review: బాలకృష్ణ "అఖండ" మూవీ రివ్యూ | Akhanda Movie Released  Today 02nd December 2021 | Akhanda Balakrishna Review in Teluguబాల‌య్య ఫ్యాన్స్‌కు త‌గిన‌ట్టుగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news