Moviesఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ సినిమా ఫిక్స్ ... నిర్మాత ఎవ‌రంటే... ?

ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమా ఫిక్స్ … నిర్మాత ఎవ‌రంటే… ?

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన దేవర సినిమా గత నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాను ఏపీ – తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ పంపిణీ చేశారు. సూర్యదేవర నాగవంశీ హోల్ సేల్ గా దేవర ఏపీ – తెలంగాణ హక్కులు కొనుగోలు చేసి ఆయన తన డిస్ట్రిబ్యూటర్ల‌ ద్వారా సినిమాను రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు దేవర సినిమా లాభాల్లోకి వచ్చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలలో దేవర సినిమా పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లు అందరు ఇప్పుడు ఛ‌లో దుబాయ్ అనబోతున్నారు.

Aravinda Sametha Veera Raghava Full Movie Online in HD in Kannada on  Hotstar UKసినిమా రిలీజ్ రోజు ఉదయం వచ్చిన టాక్కు హోల్సేల్ బయ్యర్ సీతార నాగ‌వంశీ కాస్త టెన్షన్ పడ్డారు. వరుసగా సెలవులు వేరే సినిమాలు లేకపోవడం ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా నటించిన సినిమా కావడంతో బాక్సాఫీస్ దగ్గర గట్టెక్కి లాభాల్లోకి వచ్చేసింది. ఇది ఇలా ఉంటే నైజాం – వైజాగ్ ఓవ‌ర్ ప్లోస్ ఏమన్నా ఉంటే అవి భయ్యర్ నాగ‌ వంశీకే ద‌క్క‌నున్నాయి. అందుకే సితార – హారిక హాసిని బయ్యర్లు అందరిని ఇప్పుడు దుబాయ్ తీసుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. వాళ్లంతా ఈ నెల 16న దుబాయ్ వెళ్లి తిరిగి 19న వస్తారు .. అంటే రెండు మూడు రోజుల ట్రిప్ ఉంటుంది.

Devara: Part - 1 Movie Review: Jr NTR shines in a visually stunning yet  predictable action drama
ఈ ట్రిప్ లో బయ్యర్లతో పాటు నాగ వంశీ అతని స్నేహితులు కూడా ఉంటారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా కూడా ఉంది. ఈ రెండు సినిమాలు ముగిసిన తర్వాత త్రివిక్రమ్ – బన్నీ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఎన్టీఆర్ – హారిక హాసిని – త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఫిక్స్ అని తెలుస్తుంది. ఏది ఏమైనా అరవింద సమేత వీర రాఘవ తర్వాత మరోసారి త్రివిక్రమ్ – ఎన్టీఆర్ జతకట్టడం దాదాపు ఫిక్స్ అయినట్టే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news