Moviesబాల‌య్య - బోయ‌పాటి BB4 దుమ్ము రేపే అప్‌డేట్ వ‌చ్చేసింది...!

బాల‌య్య – బోయ‌పాటి BB4 దుమ్ము రేపే అప్‌డేట్ వ‌చ్చేసింది…!

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం NBK109 మూవీలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు కేఎస్‌. ర‌వీంద్ర ( బాబి ) ద‌ర్శ‌కుడు.. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ.. త్రివిక్ర‌మ్ భార్య సాయి సౌజ‌న్య క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత బాలయ్య తన నెక్ట్స్ సినిమా మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో చేయబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్ప‌టికే వ‌చ్చిన అఖండ – లెజెండ్ – సింహా మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. దీంతో వీరిద్దరి కాంబోలో తెరకెక్కబోయే సినిమాపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.

Akhanda Full Movie Online in HD in Telugu on Hotstar CA

అస‌లు అఖండ హిట్ అయిన‌ప్పుడే బోయ‌పాటి అఖండ‌కు సీక్వెల్ ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. అప్ప‌టి నుంచే అఖండ 2 గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రానున్న అఖండ 2 సినిమాపై దసరా సందర్భంగా ఏదైనా అప్డేట్ ఉంటుందా అని అభిమానులు అందరూ ఎంతో ఎగ్జైట్మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఇదే విష‌యంపై సోష‌ల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

Legend (2014) - IMDb

బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో రాబోయే నాలుగో సినిమాను అక్టోబర్ 16న అధికారికంగా పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టబోతున్నార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో దీనిపై ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ట్రెండింగ్ చేస్తున్నారు. BB4 అనే హ్యాష్‌ట్యాగ్‌ను వారు ట్రెండ్ చేస్తున్నారు. ఏదేమైనా అఖండ 2 ఈ యేడాది షూటింగ్ ప్రారంభించి వ‌చ్చే యేడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news