Moviesఅందాల ముద్దుగుమ్మ ' కావ్య థాప‌ర్ ' ది ఏ ఊరు.....

అందాల ముద్దుగుమ్మ ‘ కావ్య థాప‌ర్ ‘ ది ఏ ఊరు.. ఏజ్ ఎంతో తెలుసా…!

కావ్య థాపర్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో బాగా హైలైట్ అవుతున్న ఈ అందాల ముద్దుగుమ్మ.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన డబుల్‌ ఇస్మార్ట్ సినిమాలో నటించిన‌ కావ్య ఈ దసరాకు గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన విశ్వం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. కావ్య అసలు పేరు కావ్య ప్రవీణ్ థాఫ‌ర్‌. 1995 మహారాష్ట్రలో ఆమె జన్మించారు. ఈ లెక్క‌న ఆమె వ‌య‌స్సు ప్ర‌స్తుతం 29. ముంబైలో చదువు పూర్తి చేసిన కావ్య థాఫ‌ర్.. కాలేజీలో సైన్స్ అండ్ కామర్స్ లో డిగ్రీ పట్టా పొందారు.

Ram Pothineni and Kavya Thapar are an absolute mood in Maar Muntha Chod  Chinta | The Pioneer

2013లో హిందీ షార్ట్ ఫిల్మ్‌తో ఆమె కెరీర్ ప్రారంభించారు. అలాగే పలు వాణిజ్య ప్రకటనలలోనూ కనిపించి ఆకట్టుకున్నారు. 2018 లో వచ్చిన ఈ మాయ పేరేమిటో అనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చారు. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. మార్కెట్ రాజా ఎంబిబిఎస్ సినిమాతో కోలీవుడ్, మిడిల్ క్లాస్ లవ్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు. ఇప్పటికే మూడు సినిమాలతో సందడి చేశారు. తాజాగా గోపీచంద్‌తో కలిసి విశ్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన అంద చందాలతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.

Viswam Review: గోపీచంద్‌ 'విశ్వం' మూవీ రివ్యూ! - NTV Telugu

కావ్య ఫుల్ మాస్ యాక్షన్ సినిమాతో పాటు.. సూపర్ నాచురల్ సినిమాలు చేయాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆమె ఎక్కువగా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. విశ్వం సినిమా సూపర్ హిట్ అవ్వాలని దేవి నవరాత్రులలో ఉపవాసం చేసినట్టు కూడా కావ్య‌ తెలిపింది. విశ్వం సినిమాలో ఆమె కాస్ట్యూమ్‌ డిజైనర్ పాత్రలో కనిపించారు. ఇక తెలుగు బాగా మాట్లాడటం కోసం ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో గోపీచంద్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్టు కావ్య తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news