Moviesబాల‌య్య - బి. గోపాల్ సోషియో ఫాంట‌సీ మూవీ... హీరోయిన్ ఎవ‌రంటే..?

బాల‌య్య – బి. గోపాల్ సోషియో ఫాంట‌సీ మూవీ… హీరోయిన్ ఎవ‌రంటే..?

నట‌సింహం నందమూరి బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్ అంటే ఒకప్పుడు తిరుగులేని క్రేజ్ ఉండేది. వీరిద్దరి కాంబినేషన్‌లో వరుసగా 4 సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. లారీ డ్రైవర్ తో ప్రారంభమైన ఈ ఇద్దరి జర్నీ.. ఆ తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు, ఇండస్ట్రీ హిట్లతో దూసుకుపోయింది. వీరిద్దరి కాంబినేషన్‌లో చివరి సినిమాగా వచ్చిన పలనాటి బ్రహ్మనాయుడు అంచనాలు అందుకోలేక‌ డిజాస్టర్ అయింది.

Lorry Driver Reviews + Where to Watch Movie Online, Stream or Skip?

పలనాటి బ్రహ్మనాయుడు సినిమా తర్వాత మరోసారి బాలయ్య – బి.గోపాల్ కలిసి పని చేయాలని ప్రయత్నాలు చేస్తున్నా అవి సాధ్యం కాలేదు. అయితే పలనాటి బ్రహ్మనాయుడు డిజాస్టర్ తర్వాత బాలయ్య, బి. గోపాల్ కాంబినేషన్‌లో ఒక సోషియో ఫాంట‌సీ మూవీ అనుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా మణిచందనను ఎంపిక చేశారట. మణిచందన, బాలకృష్ణ పై 3 – 4 రోజులు పాటు కొన్ని సీన్లు కూడా షూటింగ్ జరిగిందట. అయితే కథ‌ అనుకున్నట్టుగా రాలేదని.. దీంతోపాటు.. కొని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా పట్టాలు ఎక్కలేదని టాక్.

సమరసింహారెడ్డి Movie Review - Reviewed by | Filmibeat Telugu

అయితే ఈ విషయం చాలా రోజుల తర్వాత హీరోయిన్ మణిచందన స్వయంగా బయట పెట్టడంతో అందరికీ తెలిసింది. ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన మణి చందన.. ప్రస్తుతం రీఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసుకుపోతోంది. తాజాగా వచ్చిన టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో మణిచందన హీరోయిన్. జాన్వీకపూర్ తల్లి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news