మన సాధారణ జీవితాల్లో అనేక ఎమోషన్లు ఉంటాయి. తాజాగా సుహాస్ హీరోగా దిల్ రాజు సమర్పణలో వచ్చిన ‘జనక అయితే గనక’ కూడా మిడిల్ క్లాస్ స్టోరీనే. నేటితరం జంటలు పెళ్లి తర్వాత పిల్లల్ని కనే విషయంలో ఎందుకంత ఆలోచన చేస్తున్నారు… మధ్య తరగతి జీవితాలను నేపథ్యంగా చేసుకుని దర్శకుడు సందీప్‌రెడ్డి బండ్ల ఈ సినిమా కథ చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
స్టోరీ :
ప్రసాద్(సుహాస్)ది మధ్య తరగతి కుటుంబం. మనోడికి పిల్లలను కనడం కంటే వాళ్లకు ది బెస్ట్ ఇవ్వాలన్న క్లారిటీ ఉంది. లేకపోతే పిల్లలను కనకూడదు అన్నదే అతడి సిద్ధాంతం. రు. 30 వేల జీతానికి పనిచేసే ప్రసాద్‌కి పిల్లలను బాగా చూసుకునే స్థోమత ఉండదు. అందే పెళ్లయ్యి రెండేళ్లు అవుతున్నా పిల్లల జోలికి వెళ్లడు. ప్రసాద్ భార్య(సంగీత విపిన్) భర్త మనస్సు అర్థం చేసుకున్నా.. ఇంట్లో పేరెంట్స్ మాత్రం ఎప్పుడూ పిల్లలు అంటూ గోల పెడుతూ ఉంటారు. అనూహ్యంగా ప్రసాద్ భార్య నెల తప్పుతుంది. ఆ కండోమ్ సరిగ్గా పని చేయలేదని ఆ కంపెనీ పై కేసు వేస్తాడు ప్రసాద్. తర్వాత ఏం జరిగింది? ఈ కేసులో ఏం జరిగింది.. ప్రసాద్ తండ్రి అయ్యాడా ? లేదా ? అన్నదే సినిమా కథ.
విశ్లేషణ :
ఈ కథ వింటుంటే సూపర్ అనిపిస్తుంది. దీనిని తెరమీదకు తీసుకు రావడంలోనే దర్శకుడి పనితనం బయట పడుతుంది. కండోమ్ కంపెనీ మీద కేసు పెట్టే ఐడియా బాగున్నా … దానిని స్క్రీన్ ప్లేగా మార్చి సినిమాగా చూపించడంలోనే కొంత ఇబ్బంది ఎదురైయింది. ఈ పాయింట్ ఇంటర్వెల్ ముందు గానీ ఓపెన్ అవ్వదు. అప్పటివరకూ ఏదో టైం పాస్ చేస్తాడు. భార్య భర్తల ఎమోషన్ బిల్డ్ చేయడానికి చాలా టైం తీసుకున్నాడు. ఈ రోజుల్లో పిల్లల్ని కనాలంటే ఎంత ఖర్చు అవుతుందని ప్రాక్టికల్ గా చూపించిన సీన్లు బాగున్నాయి.. ఇంటర్వెల్ ఆసక్తిగా ఉంది.
ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంత బెటర్. మురళీశర్మ కోర్ట్ డ్రామాలోకి వచ్చాక డ్రామా బాగుంది. ప్రసాద్ భార్య కోర్టులోకి వచ్చి వాంగ్మూలం ఇస్తే కేసు ముగిసినట్టే. దీనికోసం చాలా వరకు సాగదీసిన భావన కలుగుతుంది. కోటికి బదులు ఐదు లక్షలు ఇప్పిస్తామనే సీక్వెన్స్ బలహీనం. స్కూల్, హాస్పిటల్ ఫీజులు తగ్గించమని డిమాండ్ చేయడం ఈ కథతో అంతగా ముడిపడని అంశం. సుహాస్‌కు మిడిల్ క్లాస్ క్యారెక్టర్లు కొత్తకాదు. అయితే అతడి క్యారెక్టర్ అంతగా కనెక్ట్ అయ్యేలా రాసుకోలేదనిపిస్తుంది.
పిల్లల విషయంలో కేవలం ఖర్చుని మాత్రమే చూస్తాడు కానీ ఎమోషన్ పక్కన పెట్టినా… చివర్లో అనూహ్యంగా టర్న్ అవ్వడం సహజంగా ఉండదు. సంగీత విపిన్ హుందాగా నటించింది. గోపరాజు రమణ, వెన్నెల కిశోర్ కొన్ని నవ్వులు పంచాడు. కండోమ్ కిషోర్ అనే బిరుదు ఇవ్వడం బాగుంది. మురళిశర్మ సెకెండాఫ్‌లో ఎంతోకొంత డ్రామాని నిలబెట్టాడు. రాజేంద్ర ప్రసాద్ న్యాయమూర్తి పాత్రలో ఓవర్ ది బోర్డ్ పెర్ఫార్మెన్స్ చేయడం బాగోలేదు.
టెక్నికల్ గా సినిమా ఓకే… పాటలు రిజిస్టర్ కాలేదు కానీ నేపధ్యం సంగీతం ఓకే. సాయి శ్రీరామ్ కెమెరాపనితనం డీసెంట్. దర్శకుడు ఓ మంచి ఐడియానే పట్టుకున్నాడు. కానీ ఐడియాలో వున్న ఆసక్తి సినిమాలో కనిపించలేదు. అయినా ఈ సినిమాకి ఢోకా లేదు. ఎక్కడ లైన్ దాటినా అపహాస్యం అయిపోయే ప్రమాదం ఉన్న పాయింట్‌ను డీసెంట్ గా ట్రీట్ చేశారు. చివర్లో బామ్మ ఇచ్చిన ట్విస్ట్ అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంది. అదేంటో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఫైనల్ పంచ్ : ఖచ్చితంగా చూడాల్సిన కామెడీ.. కోర్టు డ్రామా
రేటింగ్ : 2.75 / 5