Moviesప్ర‌శాంత్ నీల్ - రామ్‌చ‌ర‌ణ్ సినిమా... క్రేజీ కాంబినేష‌న్ సెట్ చేసింది...

ప్ర‌శాంత్ నీల్ – రామ్‌చ‌ర‌ణ్ సినిమా… క్రేజీ కాంబినేష‌న్ సెట్ చేసింది ఎవ‌రంటే..!

టాలీవుడ్ మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గేమ్‌ఛేంజ‌ర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ బుచ్చిబాబు సానా సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను కూడా భారీ బ‌డ్జెట్‌తో మైత్రీ మూవీస్ వాళ్లు నిర్మిస్తున్నారు. బుచ్చిబాబు సానా త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్లో సినిమా ఖాయ‌మైంది.

ప్ర‌శాంత్ నీల్ ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ త‌ర్వాత స‌లార్ 2 సినిమా ఉంటుంది. ప్ర‌భాస్ తో తీసిన స‌లార్ సినిమాకు కంటిన్యూగా స‌లార్ 2 సినిమా ఉంటుంది. ఆ త‌ర్వాత కేజీయ‌ఫ్ 3 ఉంటుందా… లేదా స‌లార్ 2 సినిమా త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ – ప్ర‌శాంత్ నీల్ సినిమా ఉంటుందా ? అన్న‌ది చూడాలి. ఈ క్రేజీ కాంబినేష‌న్‌ను అగ్ర నిర్మాత డీవీవీ దాన‌య్య సెట్ చేశారు.

Prashanth Neel meets Chiranjeevi and Ram Charan for dinner | Telugu Movie  News - Times of India

డీవీవీ ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై దాన‌య్య ప్ర‌శాంత్ నీల్ – రామ్‌చ‌ర‌ణ్ సినిమాను నిర్మిస్తారు. ఎన్టీఆర్ – రామ్‌చ‌ర‌ణ్‌తో త్రిబుల్ ఆర్ లాంటి ప్రెస్టేజియ‌స్ సినిమాను దాన‌య్య నిర్మించారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మ‌రోసారి దాన‌య్య‌.. చ‌ర‌ణ్‌తో సోలో సినిమా నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news