Movies' అఖండ 2 ' షూటింగ్ టైం స్టార్ట్‌... నంద‌మూరి అభిమానుల‌కు...

‘ అఖండ 2 ‘ షూటింగ్ టైం స్టార్ట్‌… నంద‌మూరి అభిమానుల‌కు సూప‌ర్ కిక్‌..!

బాలకృష్ణకు వ‌రుస పరాజయాల తర్వాత.. అఖండ సినిమాతో అదిరిపోయే హిట్‌ వచ్చింది. అఖండ దెబ్బకు ధియేటర్లు అఖండ గర్జనలా మోగిపోయాయి. బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే తిరుగులేని సూపర్ డూపర్ హిట్లు. సింహ, లెజెండ్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు తర్వాత అఖండ కూడా వరుసగా మూడో అద్భుత విజయాన్ని సాధించింది. అఖండ వచ్చినప్పటి నుంచి దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 వస్తుందని ప్రకటిస్తూ వస్తున్నారు.

Akhanda2: Balakrishna bracing for special sensation | cinejosh.com

బోయపాటి ఆ ప్రకటన చేసినప్పటి నుంచి నందమూరి అభిమానులతో పాటు.. బాలయ్య అభిమానులు, అఖండ మూవీని అమితంగా ఇష్టపడ్డ వారు అందరూ అఖండ 2 ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది..? ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుంటుంది..? ఎప్పుడు దియేటర్లలోకి దిగుతుంది..? అని ఒక్కటే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ మొదలవుతుందా..? అని అందరిలోనూ ఒక్కటే ఉత్కంఠ కూడా ఉంది. ప్రస్తుతం చూస్తే బాలయ్య.. బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమాలో నటిస్తున్నారు.

Boyapati Srinu: అఖండ 2 ఎప్పుడో చెప్పేసిన బోయపాటి శ్రీను - NTV Telugu

ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. సినిమా షూటింగ్ చాలావరకు పూర్తికానుంది. నవంబర్ చివరికి బాబీ సినిమా పూర్తి అయిన వెంటనే.. డిసెంబర్ నుంచి అఖండ 2 సెట్స్ మీదకు వెళ్ళ‌నుంది. తొలి షెడ్యూల్‌లో బాలయ్య అఖండ పార్ట్ 2 పాత్ర‌కు పరిచయ సన్నివేశాలు షూట్ చేస్తారట. బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నారు. బోయపాటి ప్రస్తుతం అఖండ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేర్చినట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news