టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ భారీ యాక్షన్ డ్రామా దేవర. 2018 చివర్లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ లాంటి సోలో సినిమా తర్వాత.. ఎన్టీఆర్ ఆరేళ్ల గ్యాప్ తీసుకుని సోలో హీరోగా చేసిన సినిమా దేవర. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన దేవర సినిమా భారీ పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
కనీవినీ ఎరుగని రేంజ్లో భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన దేవర సినిమా.. మిక్స్డ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర జర్నీ స్టార్ట్ చేసి.. ఊహించిన విధంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి రికార్డ్ వసూళ్లు సాధించింది. సోలోగా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా ఈ సినిమా నిలిచింది. ఇక రెండో వీకెండ్ లో కూడా తెలుగు రాష్ట్రాలలో దేవర అదరగొట్టేసింది. ఆదివారం అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు అన్నిచోట్ల హైస్పీడ్ రన్‌తో దేవర దూసుకు వెళ్ళింది. ఆదివారం ఒక్కరోజే దేవర లక్షకు పైగా బుకింగ్స్ నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది.
కొన్నిచోట్ల అయితే డిమాండ్ మేరకు అదనపు షోలు, అదనపు స్క్రీన్లు కూడా యాడ్ చేశారు. అలా హైదరాబాద్‌లో అయితే అదనపు షోలు.. అదనపు స్క్రీన్లు యాడ్ చేశారు. రెండో వీకెండ్ పూర్తయ్యేసరికి దేవర మంచి ఆక్యుపెన్సి అందుకుంది. ఇక సోమవారం నుంచి టికెట్ ధరలు కూడా తగ్గనున్నాయి. ఇది కూడా సినిమాకు చాలా ప్లస్ కానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ – యవసుధ బ్యానర్లపై కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించగా.. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటించింది.