టాలీవుడ్ యంగ్ టైగర్‌కు టెంపర్ సినిమాకు ముందు వరకు వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. శక్తి , రభస, రామయ్య వస్తావయ్య ఇలా వరుస పెట్టి డిజాస్టర్ సినిమాలతో ఎన్టీఆర్ కెరీర్ ఒక్కసారిగా పాతాళంలోకి వెళ్లిపోయింది. 2015లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమాతో ఎన్టీఆర్ విజయ యాత్ర ప్రారంభమైంది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఏడు వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో ఎన్టీఆర్ తిరుగులేకుండా దూసుకుపోతున్నారు. ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు పతాక స్థాయిలో ఉంది.
వరుసగా టెంపర్ నుంచి తాజాగా వచ్చిన దేవర సినిమా వరకు అన్ని సూపర్ డూపర్ హిట్లే. పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ డూపర్ హిట్అయి ఎన్టీఆర్ ఇమేజ్ను ఒక్కసారిగా పెంచేశాయి. ఇక టెంపర్ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కకగా.. బండ్ల గణేష్ ఈ సినిమాకు నిర్మాత, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది. వక్కాంతం వంశీ రైటర్‌గా పనిచేశారు. ఎప్పుడో ఢిల్లీలో జరిగిన నిర్భయ హత్యను ఆధారంగా చేసుకుని అద్భుతమైన కథ రాసుకున్నారు వంశీ. పూరి జగన్నాథ్ చెప్పిన కదా ఎన్టీఆర్ కు నచ్చలేదు. వంశీ కథ గురించి పూరి దగ్గర ప్రస్తావించడంతో పూరి అదే కథతో ఎన్టీఆర్‌తో టెంపర్ సినిమా తీసేందుకు రెఢీ అయ్యారు.
అంతకుముందే బండ్ల గణేష్.. ఎన్టీఆర్‌తో బాద్షా సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఇక టెంపర్ కూడా తొలి రోజు.. తొలి ఆట నుంచే సూపర్ డూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయింది. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో రెండు గొడవలు జరిగాయి. నిర్మాత బండ్ల గణేష్ కు, ఎన్టీఆర్‌కు ఎక్కడో తేడాకొట్టింది. ఒకానొక టైం లో ఎన్టీఆర్, బండ్ల గణేష్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు.. గణేష్‌ని అసలు సెట్ లోకి కూడా రావద్దు అన్నారన్న గుసగుసలు వినిపించాయి. ఇక కథ ఇచ్చిన వంశీకి.. బండ్ల గణేష్ మాట్లాడుకున్న రెమ్యూనరేషన్ ఇవ్వలేదని.. చాలా రోజుల తర్వాత ఇచ్చిన చెక్కు కూడా బౌన్స్ అయిందని వంశీ ఆరోపించారు. వంశీ తప్పనిసరి పరిస్థితులలో బండ్ల గణేష్ మీద చెక్ బౌన్స్ కేసు కూడా పెట్టాల్సి వచ్చింది. అప్పట్లో ఈ రెండు టెంపర్ గురించి ఇండస్ట్రీలో బాగా వైరల్ అయ్యాయి.