నటకిరీటీ రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. రాజేంద్ర ప్రసాద్ ముద్దుల కుమార్తె గాయత్రి ( 38) చాలా చిన్న వయస్సులోనే గుండెపోటుతో మృతి చెందారు. రాజేంద్ర ప్రసాద్ జీవితంలో రెండుసార్లు విధి ఆడిన వింత నాటకం గురించి తెలిస్తే ఆయన హృదయం మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరి హృదయం ద్రవీభవిస్తుంది. తన ఫ్యామిలీ గురించి ఎప్పుడూ చెప్పని రాజేంద్రుడు తన తల్లి విషయంలోనూ, అలాగే ఇప్పుడు చనిపోయిన తన కుమార్తె విషయంలోనూ రెండు సార్లు స్టేజ్‌పై చెప్పుకొచ్చారు.
చిన్నప్పుడే రాజేంద్రుడి తల్లి చనిపోయిందట. అమ్మకోసం ఎదురు చూసి చూసి నా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను.. అమ్మకోసం ఏడ్చి ఏడ్చి తాను కూడా చనిపోయే స్టేజ్‌కి వచ్చానని.. అప్పుడు కుటుంబ సభ్యులు కనకదుర్గమ్మ గుడికి తీసుకువెళ్లారు.. ఇకపై నీకు కనకదుర్గమ్మే నీకు అన్నీ చెప్పడంతో అలా కనకదుర్గమ్మనే అమ్మ అని పిలుచుకుంటూ పెరిగాడట.
ఇక బేవర్స్ సినిమా ప్రి రిలీజ్ వేడుకలో కూడా రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడూ షేర్ చేసుకోని ఓ విషయం చెప్పారు. ఆ సినిమా కోసం ‘తల్లీ తల్లీ నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా.. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా’ అంటూ సుద్ధాల అశోక్ తేజ రాసిన పాట విన్నప్పుడు చిన్నప్పుడు చనిపోయిన తన అమ్మతో పాటు తనతో మాట్లాడటం మానేశాను అని… కానీ ఈ పాట విన్నాక.. నా కూతురిని ఇంటికి పిలిపించుకుని.. ఈ పాటను నాలుగు సార్లు వినిపించాను అని రాజేంద్రుడు తెలిపారు.
ఈ పాట విన్నాక నాకు తన కుమార్తెపై కోపం పోయిందని.. అమ్మ చనిపోయినప్పుడు ఎలా అయితే ఏడ్చానో.. అలా ఏడ్చేశా అని ఈ రెండు సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడ్డారు. ఇక అప్పుడు అమ్మ.. ఇప్పుడు కుమార్తె ఇద్దరూ మనోడిని వదిలి .. ఒంటరిని చేసి వెళ్లిపోయారు. ఏ అమ్మవారిని అయితే అమ్మగా రాజేంద్రప్రసాద్ భావించారో.. ఆ అమ్మవారికి ఇష్టమైన దసరా రోజులలోనే తన కుమార్తెను కోల్పోయారు.