Moviesఎన్టీఆర్‌ను అలా ఇరికించేసిన అల్లు అర్జున్‌...!

ఎన్టీఆర్‌ను అలా ఇరికించేసిన అల్లు అర్జున్‌…!

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు మామూలు క్రేజ్ లో లేడు. ఆరు వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్ తాజాగా దేవర సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి అదిరిపోయే పాన్ ఇండియా హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే అటు ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ట్ డం తెచ్చుకున్నాడు. ఇప్పుడు పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్నపుష్ప‌ పార్ట్ 2 పై దేశవ్యాప్తంగా కనివినీ ఎరుగ‌ని రేంజ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఎంతో బెస్ట్ ఫ్రెండ్స్.. వీరిద్దరూ ఒకరినొకరు బావ బావ అని పిలుచుకుంటూ ఎంతో ఆప్యాయతతో ఉంటారు.

Watch Naa Peru Surya Na Illu India Full HD Movie Online on ZEE5

టాలీవుడ్ లో ఈ తరం జనరేషన్ హీరోలలో చాలా సన్నిహితంగా ఉండే హీరోలలో ఎన్టీఆర్ – బన్నీ జంట ఒకటి. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ హీరోగా మంచి కథా రచయితగా పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీ దర్శకత్వంలో వ‌చ్చిన సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. అయితే ఎన్టీఆర్ టెంపర్ తర్వాత నీతో ఒక సినిమా చేస్తానని వంశీకి మాటే ఇచ్చారు. టెంప‌ర్ సినిమాకు స్టోరీ ఇచ్చింది వంశీయే. ఈ క్రమంలోనే వంశీ తాను రాసుకున్న కథను ఎన్టీఆర్‌కు రెండు మూడుసార్లు చెప్పిన ఎన్టీఆర్కు ఎక్కడో నచ్చలేదు. ఆలోచిద్దాం అని దాట వేశారు.

9 Ntr ideas | actors images, new photos hd, hd photos

వెంటనే వంశీ – అల్లు అర్జున్ ను కలిసి ఎన్టీఆర్‌కు కథ చెప్పాను అనగా అదే కథ‌ నాకు కూడా చెప్పమని బన్నీ రిక్వెస్ట్ చేశారట. వెంటనే వంశీ కథ విన్న బన్నీ ఈ స్టోరీ తో సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పాడట. ఆ వెంటనే కొద్దిరోజులకు బన్నీ.. ఎన్టీఆర్ కు ఫోన్ చేసి ఆ కథ బ్లాక్ బస్టర్ అవుతుంది మంచి కథ పెట్టావు అని చెప్పాడట. అయితే ఎన్టీఆర్ వైపు నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ వంశీతో ఆ సినిమా చేయనని చెప్పడంతో వెంటనే బన్నీ తాను చేస్తానని వంశీకి మాటే ఇచ్చేశాడు. అలా వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా డిజాస్టర్ అయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news