Moviesషాక్‌.. దేవ‌ర‌లో చుట్ట‌మ‌ల్లె సాంగ్ తీసింది కొర‌టాల కాదా... గుట్టు ర‌ట్టు...

షాక్‌.. దేవ‌ర‌లో చుట్ట‌మ‌ల్లె సాంగ్ తీసింది కొర‌టాల కాదా… గుట్టు ర‌ట్టు చేసిన జాన్వీ..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ భారీ పాన్‌ ఇండియా సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన సినిమా కావడంతో నందమూరి – జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు తెలుగు సినిమా అభిమానులలోను భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం మూడు రోజులకే ప్రపంచ వ్యాప్తంగా రు. 304 కోట్ల రాబట్టిన ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ – యువ సుధా ఆర్ట్స్‌ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్ , మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మించారు.

Janhvi Kapoor And Jr. NTR's Sensual Song From 'Devara' Slammed By Netizens,  They Point Duo's Age Gap

ప్రపంచవ్యాప్తంగా రు. 185 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర జర్నీ స్టార్ట్ చేసింది. దేవర సినిమాలో దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. దేవర ఫ‌స్టాప్ లో జాన్వీ జాడలేదు. సెకండ్ హాఫ్ లో రంగంగా చాలా తక్కువ సీన్లలో తళుక్కున మెరిసింది. జాన్వీ కపూర్ చుట్టమల్లే సాంగు తో ఆమె దుమ్ము రేపింది. ఆమె పాత్ర తక్కువగా ఉన్న ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయేలా తన అందాలతో మెస్మరైజ్ చేసింది. చాలా స్లో పాయిజన్‌లా ఈ సాంగ్‌ ఎక్కేస్తుంది. ఈ క్రమంలోనే ఈ పాట గురించి ఓ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ రియల్ చేసింది జాన్వి.

Koratala Siva celebrates birthday today | Telugu Cinema

సినిమా ప్రమోషన్ కోసం ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో కి వెళ్లిన తారక్ – జాన్వీ – సైఫ్‌ ఆలీఖాన్ చాలా విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే మీ వైఫ్ ఫీల్ అవుతుందేమో సీన్ మారుద్దామా అని దర్శకుడికి చెప్పలేదా ? అని కపిల్ శర్మ సరదాగా అడిగారు. అసలు ఆ సాంగ్ షూట్ చేసేటప్పుడు డైరెక్టర్ అక్కడ లేరు.. అని ఎన్టీఆర్ – జాన్వీ ట్విస్ట్ ఇచ్చారు. ఆ పాటను థాయిలాండ్ లో తీశారు.. అప్పుడు ఏదో పని మీద కొరటాల అక్కడికి వెళ్ళలేదు.. కొరియోగ్రాఫర్ ఆ పాట మొత్తం షూట్ చేశారని చెప్పారు. దీంతో ప్రేక్షకులు అంత హిట్ పాట డైరెక్ట్ చేసింది కొరటాల శివ కాదా అని కామెంట్లు పెడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news