Moviesపుష్ప 3 గురించి అదిరిపోయే ట్విస్ట్‌.... పాపుల‌ర్ స్టార్ హీరోతో ..!

పుష్ప 3 గురించి అదిరిపోయే ట్విస్ట్‌…. పాపుల‌ర్ స్టార్ హీరోతో ..!

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన పుష్ప సినిమా ఎంత సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యిందో చూశాం. ఈ సినిమా ఓవ‌రాల్ గా వ‌ర‌ల్డ్ వైడ్ గా ఏకంగా రు. 365 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. బాలీవుడ్ లో అయితే ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చి భీభ‌త్స‌వం క్రియేట్ చేసి ప‌డేసింది. అక్క‌డ ఏకంగా రు. 100 కోట్ల కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రు పుష్ప సినిమాకు సీక్వెల్ గా వ‌స్తోన్న పుష్ప 2 ది రూల్ సినిమా కోసం ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు.

Pushpa: The Rule - Part 2 (2024) - IMDb

తాజాగా పుష్ప 3 గురించి ఓ పుకారు వైర‌ల్ అవుతోంది. పుష్ప 2 సినిమా ఎండింగ్ లో మూడో పార్ట్ గురించి కూడా ద‌ర్శ‌కుడు సుకుమార్ అదిరిపోయే లీడ్ రోల్ ఇవ్వ‌బోతున్నాడ‌ట‌. సినిమా ఎండింగ్ లో పుష్ప మూడో పార్ట్ గురించి అదిరిపోయే లీడ్ ను ద‌ర్శ‌కుడు సుకుమార్ సాలిడ్ గా ప్లాన్ చేశాడ‌ని.. మ‌రీ ముఖ్యంగా క్లైమాక్స్ లో ఓ పాపుల‌ర్ స్టార్ ఎంట్రీ ఇస్తార‌ని … అది మూడో పార్ట్ కు లీడ్ గా మారుతుంద‌న్న‌దే ఆ పుకార్ల సారాంశం.

WATCH: Allu Arjun Casts Vote in Hyderabad, Clarifies NOT Politically  Aligned to Any Party | India.com

అయితే, ఈ ప్రచారం పై మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇక పుష్ప 2 సినిమా డిసెంబ‌ర్ 6న ప్ర‌పంచ వ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్‌లో చాలా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే రిలీజ్ అయిన గ్లింప్స్ .. సాంగ్స్ విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. దీంతో పుష్ప 2 సినిమా పై అంచ‌నాలు దిమ్మ‌తిరిగే రేంజ్‌లో ఉన్నాయి. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news