Moviesద‌స‌రాకు ' కొత్త దేవ‌ర ' వ‌స్తున్నాడు... సినిమా రెండో రౌండ్...

ద‌స‌రాకు ‘ కొత్త దేవ‌ర ‘ వ‌స్తున్నాడు… సినిమా రెండో రౌండ్ వేస్కోండి ఇక‌…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సినిమా దేవర. బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ తో దూసుకుపోతూ వసూళ్లపరంగా వీరంగం ఆడుతోంది. దర్శకుడు కొరటాల శివ దేవర సినిమాను కంప్లీట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన తీరుకు ప్రేక్షకులు ఫిధా అవుతున్నారు. ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఎన్టీఆర్ మాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తుంది. దేవర సినిమా రిలీజ్ కి ముందే వచ్చిన దావూదీ సాంగ్ ఎంతటి సెన్షేష‌న్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ పాటలో ఎన్టీఆర్ జాన్వీ కపూర్ స్టెప్పులు అభిమానులను పిచ్చపిచ్చగా ఆకట్టుకున్నాయి.

Jr NTR and Janhvi Kapoor starrer Devara's upcoming song poster portrays  duo's impeccable chemistry
అయితే సినిమాలో ఈ పాట ఎక్కడ కనిపించలేదు కనీసం ఎండ టైటిల్స్ లో కూడా కనిపించలేదు. దీంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు అందరూ చాలా నిరాశకు గురయ్యారు. దీనికి తోడు జాన్వీకపూర్ స్క్రీన్ ప్రజెన్స్‌ కూడా చాలా తక్కువగా ఉండడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు దేవర టీం దసరా నుంచి దేవర సినిమాలో ఈ సాంగ్ తో పాటు జాన్వీ కపూర్ కి సంబంధించిన కొన్ని అదనపు సీన్లు కూడా యాడ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

దీంతో దసరా నుంచి కొత్తదేవర థియేటర్లలో సందడి చేయనున్నారు. ఇప్పటికే సినిమా చూసిన ఎన్టీఆర్ నందమూరి అభిమానులు ఇప్పుడు సరికొత్త దేవరను చూడాల్సి ఉంటుంది. దసరా సెలవులలో ఎన్టీఆర్ అభిమానులతో పాటు దేవర చూడాల్సిన వారందరూ రెండోసారి సినిమా చూసేందుకు రెడీ అవ్వాల్సిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news