Moviesఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే.. !

ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే.. !

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ తెర‌కెక్కించిన ఈ కంప్లీట్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ టాక్ తో భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ క్రమంలోని ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా గురించి సినీ సర్కిల్స్ ఇంట్రెస్టింగ్ వార్త చక్కెరలు కొడుతోంది. ఇక దేవర సక్సెస్ తర్వాత కొరటాల శివ దేవరకు కంటిన్యూగా దేవర 2 స్క్రిప్ట్ మీద కసరతులు చేయనున్నాడు.

Jr NTR: Interesting tweet from actor Jr NTR on renaming..

ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ ఇప్పుడు తన కెరీర్లో 31వ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా అధికారికంగా కూడా లాంచ్ అయింది. ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్లో ప్రేక్షకులు అర్థం చేసుకునేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ చిన్న క్లూ కూడా వదిలాడు. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా ఓ పిరియాడిక్ కథ‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథ‌ బంగ్లాదేశ్ నేపథ్యంలో జరుగుతుందని.. అక్కడ ఉండే తెలుగు వారికి అండగా ఎన్టీఆర్ నిలుస్తాడని ఈ నేపథ్యంలోనే కథ‌ సాగుతుందని వార్తలు సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి.

Prashanth neel: ప్రశాంత్‌ నీల్‌ స్వస్థలం ఏపీనే తెలుసా.? తన సమాధి అక్కడే  అంటూ ఎమోషన్‌ అయిన ప్రభాస్‌...

సినిమాలో ఎన్టీఆర్ పాత్ర సరికొత్తగా ఉండబోతుందని.. దీనిని ఇప్పటివరకు చూడని విధంగా ఎన్టీఆర్ ను ఎవరూ చూపించిన విధంగా ప్రశాంత్ నీల్‌ డిజైన్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రశాంత్ నీల్‌ ఇప్పటివరకు కంటిన్యూగా నడిపిస్తున్న బొగ్గు .. బ్లాక్ కలర్ టోన్ నేపథ్యానికి సరికొత్తగా ఈ సినిమా ఉండబోతుందట. ఏది ఏమైనా ఎన్టీఆర్ – నీల్‌ కాంబినేషన్లో రాబోయే సినిమాపై అప్పుడే బజ్ క్రియేట్ అయ్యేలా వార్తలు వస్తుండడంతో సినిమాపై హైప్‌ మామూలుగా లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news