Moviesహీరోయిన్‌ను గ‌దిలోకి పిలిచి... స్టార్ డైరెక్ట‌ర్ ఏం చేశాడంటే... !

హీరోయిన్‌ను గ‌దిలోకి పిలిచి… స్టార్ డైరెక్ట‌ర్ ఏం చేశాడంటే… !

ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా అన్ని భాష‌ల్లో ఉన్న సినిమా రంగాల్లో క్యాస్టింగ్ కౌచ్ అనేది రోజురోజుకు విజృంభిస్తోంది. మ‌రీ ముఖ్యంగా మీటూ ఉద్య‌మంతో ఇది బాగా పాపుల‌ర్ అయ్యింది. మీ టూ ఉద్య‌మంతో ఎంతోమంది వేధింపుల‌కు గురైన హీరోయిన్లు.. ఇండ‌స్ట్రీలో అమ్మాయిలు ధైర్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చి తాము ఎదుర్కొన్న లైంగీక వేధింపుల గురించి చెపుతున్నారు.

Sri Reddy says uncle AR Murugadoss likes to steal women v*g*na and movie  stories - IBTimes India

సౌత్‌లో సింగ‌ర్ చిన్మ‌యి.. టాలీవుడ్‌లో శ్రీరెడ్డి… అటు బాలీవుడ్‌లో విద్యాబాల‌న్‌, పాయ‌ల్ ఘోష్‌, రాధికా ఆఫ్టే.. సీనియ‌ర్ హీరోయిన్ కస్తూరి.. మాళ‌విక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోయిన్లు త‌మ గోడు వెళ్ల‌బోసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే తనను లైంగికంగా వేధించారంటూ హీరో జయసూర్య సహా పలువురు మలయాళ సినీ ప్రముఖులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి మిను మునీర్‌ మరోసారి సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల‌తో వార్త‌ల్లోకి ఎక్కారు.

ద‌ర్శ‌కుడు బాలచంద్ర మీనన్‌ సైతం తనను లైంగికంగా వేధించారంటూ ఆమె సోష‌ల్ మీడియా ద్వారా ఆరోపించారు. 2007లోనే త‌న‌ను ప‌డ‌క గ‌దిలోకి పిలిపించుకున్న బాల‌చంద్ర అశ్లీల సినిమాలు చూడాల‌ని బల‌వంతం చేశార‌ని ఆమె ఆరోపించారు. నువ్వు నాకు తోడుగా ఉండాల‌ని అడిగార‌ని.. తాను వెంట‌నే అక్క‌డ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని ఆమె ఆరోపించారు. మాలీవుడ్‌లో వేధింపులు త‌ట్టుకోలేకే తాను త‌మిళ సినిమాలు చేసుకుంటూ చెన్నైలో ఉంటున్నాన‌ని మిను మునీర్‌ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news