టాలీవుడ్ యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ ఇంటి భోజనం గురించి ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు చాలా గొప్పగా చెప్పారు. నార్త్… సౌత్ ఇండియన్ హీరోయిన్లతో పాటు ఒకప్పుడు దేశాన్ని ఊపేసిన భాగ్య శ్రీ లాంటి హీరోయిన్లు సైతం రాధేశ్యామ్ సినిమా షూటింగ్‌లో ప్రభాస్ తన ఇంటి వంట రుచి చూపించాడని… ఆ వంటకు తాము ఫిదా అయిపోయామని చెప్పారు. ప్రభాస్‌తో నటించే ఏ హీరోయిన్‌కు అయినా ప్రభాస్ ఇంటి వంట రుచి చూపిస్తాడు.. వారిని ఆ భోజనానికి ఫిదా చేస్తాడు.
ఇక ఇప్పుడు ఈ లిస్టులోకి మరో హీరోయిన్ కూడా వచ్చి చేరింది. ఆమె ఎవరో కాదు… హీరోయిన్ మాళవికా మోహనన్. ఆమెకు తాజాగా వచ్చిన విక్రమ్ ‘తంగలాన్’ సినిమాతో మంచి హిట్ వచ్చింది. ప్రస్తుతం ‘రాజా సాబ్’, ‘సర్దార్ 2’ సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియాలో నెటిజన్లతో ముచ్చటిస్తూ ఇంట్రస్టింగ్ కామెంట్లు చెప్పింది. హైదరాబాద్ వచ్చినప్పుడు తాను ప్రత్యేకంగా తినాలనుకునే ఫుడ్ ఏంటని ఓ నెటిజన్ ప్రశ్నించగా… ఇంకేముంది ప్రభాస్ ఫుడ్ అని చెప్పింది.
హైదరాబాద్‌లో నేను తిన్న అత్యంత రుచికరమైన ఆహారం ప్రభాస్ పంపే ఇంటి భోజనం అని క్రేజీగా ఆన్సర్ ఇచ్చింది. దీనిని బట్టి ప్రభాస్ ఇంటి భోజనం ఆమెకు ఎంతగా నచ్చిందో తెలుస్తోంది. అలాగే మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటన్న ప్రశ్నకు మా అమ్మ చేతి వంట అని.. బ్రౌన్ రైస్.. చేపల కూర.. వేపుడు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది.