టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘దేవర’ మూవీ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది. ఇక ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినా కూడా వసూళ్ల పరంగా బాక్సాఫీస్ దగ్గర వీరంగం ఆడుతోంది. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేస్తున్నారు. తొలి రోజు దేవర వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ.172 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రు. 185 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.
దీంతో ఈ సినిమాకు అసలు ఎంత బడ్జెట్ అయ్యింది ? ఎవరి రెమ్యునరేషన్ ఎంత ? అనే అంశాలు ఆసక్తిగా మారాయి. దేవర సినిమాను మొత్తం రు. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ తెరకెక్కించారంటున్నారు. అయితే అంత బడ్జెట్ అయ్యిందా ? ఈ బడ్జెట్‌లో రెండో పార్ట్ బడ్జెట్ కూడా కలిసి ఉందా ? అన్న సందేహాలు ఉన్నాయి.
ఇక రెమ్యునరేషన్ల విషయానికి వస్తే ఎన్టీఆర్ ఈ సినిమా కోసం రూ.60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని.. జాన్వీ కపూర్ రూ.5 కోట్లు, సైఫ్ అలీ ఖాన్ రూ.10 కోట్లు, ప్రకాష్ రాజ్ రూ.1.5 కోట్లు తీసుకున్నట్లు టాక్.. ఇక మిగిలిన క్యాస్ట్ కూడా తమ మామూలు రెమ్యునరేషన్ల కంటే కాస్త ఎక్కువే తీసుకున్నారని టాక్ ? ఇక దర్శకుడు కొరటాల శివ కు ఎంత ఇచ్చారు.. ఆయనకు రెమ్యునరేషన్ ఇచ్చారా ? లేదా ? లాభాల్లో వాటా ఇచ్చారా ? అన్నది తెలియట్లేదు. ఎందుకంటే శివ చివరి సినిమా ఆచార్య డిజాస్టర్ అయ్యింది. దీంతో శివ రెమ్యునరేషన్ ఎంతన్నది తెలియ రాలేదు.