Movies' దేవ‌ర ' ఫ‌స్ట్ డే ఏపీ - తెలంగాణ ఏరియా...

‘ దేవ‌ర ‘ ఫ‌స్ట్ డే ఏపీ – తెలంగాణ ఏరియా వైజ్ క‌లెక్ష‌న్స్‌… ఆల్ టైం 2 ర్యాంక్‌..!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ .. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ న‌టించిన లేటెస్ట్ సినిమా దేవ‌ర. త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా సూప‌ర్ హిట్ సినిమా త‌ర్వాత రెండున్నరేళ్లు ల్యాంగ్ గ్యాప్ త‌ర్వాత న‌టించిన సినిమా కావ‌డంతో అంచ‌నాలు మామూలుగా లేవు. ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టించింది. ఇదే ఆమెకు సౌత్‌లో తొలి సినిమా.. ఇక అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించారు.

Devara Part 1 Movie Review, Rating And Day 1 Box Office Collections | Times  Now

యువ‌సుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై మిక్కిలినేని సుధాక‌ర్ – నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. తొలి రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా రు. 140 కోట్ల వ‌సూళ్లు ఈ సినిమాను రాబ‌ట్టింది. ఏపీ, తెలంగాణ‌లో రు. 68 కోట్ల వ‌సూళ్లు రాగా.. ఆలిండియా వైడ్ గా రు. 77 కోట్లు వ‌చ్చాయి. త్రిబుల్ ఆర్ త‌ర్వాత ఏపీ, తెలంగాణ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్ల‌లో దేవ‌ర రెండో స్థానంలో ఉండ‌గా.. స‌లార్ మూడో ప్లేస్‌కు ప‌డిపోయింది. ఇక ఏపీ, తెలంగాణ‌లో ఏరియా వైజ్‌గా వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.

Devara Box Office Collection: देवरा ने ओपनिंग डे पर मचाया तांडव, जानें  कलेक्शन - devara box office collection day 1 jr ntr janhvi kapoor saif ali  khan starrer movie opening day

నైజాం – రూ. 19.32 కోట్లు
విశాఖ – రూ. 5.47 కోట్లు
గుంటూరు – రూ. 6.27 కోట్లు
నెల్లూరు – రూ. 2.11 కోట్లు
కృష్ణా – రూ. 3.02 కోట్లు
ఈస్ట్ – రూ. 4.02 కోట్లు
వెస్ట్ – రూ. 3.60 కోట్లు
సీడెడ్ – రూ. 10.40 కోట్లు
————————————————————–
ఏపీ + తెలంగాణ షేర్ = రూ. 54.21 కోట్లు

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news