Movies' దేవ‌ర ' ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్ @ రు....

‘ దేవ‌ర ‘ ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్ @ రు. 140 కోట్లు… వాళ్ల నోళ్ల‌కు ప్లాస్ట‌ర్ వేసేసిన తారక్ ..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకునే విషయంలో కొంతవరకు తడబడింది. గురువారం అర్ధ‌రాత్రి ప్రీమియ‌ర్ షోలు చూశాక అభిమానులు కాస్త నిరాశ‌కు గుర‌య్యారు. సినిమాకు మిక్స్‌డ్ టాక్ కూడా వ‌చ్చింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు మంచి వసూలు సాధించింది.

Devara Part 1 Movie Review Starring Jr NTR Saif Ali Khan Janhvi Kapoor

ఫ్రీ సేల్ బుకింగ్స్‌లోనే రికార్డులు సొంతం చేసుకున్న దేవర తొలి రోజు కలెక్షన్ల పరంగా టాప్‌ ప్లేస్ లో నిలిచింది. భారతదేశ వ్యాప్తంగా రు. 77 కోట్ల వ‌సూళ్లు రాబట్టిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు రు. 140 కోట్లు కొల్లగొట్టింది. ఇండియాలో వచ్చిన కలెక్షన్లలో రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ – తెలంగాణ నుంచి రు. 68 కోట్లకు పైనే ఉన్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో ఏడు కోట్లకు పైగా నెట్టు వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఎన్టీఆర్ కి జోడిగా జాన్వీ కపూర్ నటించడం ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు.

Devara Movie Review: Jr NTR, Saif Ali Khan starrer is a violent action  fairytale that loses momentum due to subpar execution | PINKVILLA

యువ‌సుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై మిక్కిలినేని సుధాక‌ర్ – నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా రెండు పార్టులుగా తెర‌కెక్కుతోంది. గ‌తంలో వీరి కాంబోలో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ సూప‌ర్ హిట్ అయ్యింది. ఇక దేవ‌ర అంతంత మాత్రం టాక్ అని మాట్లాడిన వాళ్ల నోళ్ల‌కు తార‌క్ త‌న క‌లెక్ష‌న్ల‌తో ప్లాస్ట‌ర్ వేశాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news