తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం భారతీయ సినిమాను శాసిస్తుంది. ఇలాంటి క్రమంలో కొత్త కథలతో సినిమాలు చేస్తూ వస్తున్నారు స్టార్ హీరోలు. ప్రస్తుతం తెలుగు సినిమాల కోసం ఇతర భాషల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా మీద ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి మరికొన్ని గంటలు సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రీమియర్ షో లను యుఎస్ లో ప్రదర్శించారు. మరి అక్కడ సినిమా చూసిన ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఏం చెప్తున్నారనేది ఒకసారి ఇక్కడ చూద్దాం.
స్టోరీ:
ఈ సినిమా కథ విషయానికి వస్తే వైజాగ్ లో సముద్రం మీద ఆధారపడి బతుకుతున్న కొన్ని కుటుంబాలను అల్లకల్లోలం చేయడానికి ఒక వ్యక్తి పునుకుంటాడు. అలాగే ఆ వ్యక్తి కూడా ఆ కుటుంబాలలో నుంచి వచ్చిన వాడే కావటం ఇక్కడ విశేషం.. అయితే అతనికి వ్యతిరేకంగా దేవర ప్రజలకు అండగా నిలబడతాడు. మరి ఆ దేవరన్ని ఎవరు చంపారు..? తన కొడుకు వచ్చి వాళ్ళ మీద ఎలా రివెంజ్ తెచ్చుకున్నాడు అనే పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక దేవరను చంపింది ఎవరు.. ఎందుకు చంపారు అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమాను థియేటర్లో చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇక ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కొరటాల శివ కథని రొటీన్ ఫార్ములా తోనే రాసుకున్నప్పటికీ సినిమా స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం సరికొత్త పంథాను అనుసరించాడు అంటూ సినిమాను చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. నిజానికి కొరటాల శివ లాంటి దర్శకుడు ఈ కొత్త మేకింగ్ విధానాన్ని నేర్చుకుని చేసిన సినిమాగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. ఇక ఎన్టీఆర్ నటన ఈ సినిమాకి ఎంతో హైలైట్ గా నిలిచిందని.. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ బాగున్నప్పటికీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో మాత్రం అనిరుధ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడని కూడాా అంటున్నారు. ఈ విధంగా దేవర సినిమా హిట్ టాక్ సాధించే దిశగా దూసుకుపోతుందని కూడా సినిమా చూసిన యూఎస్ అభిమానులు చెప్పటం విశేషం.
ఆర్టిస్టుల పర్ఫామెన్స్:
ముందుగా హీరోగా ఎన్టీఆర్ నటన నెక్స్ట్ లెవెల్ లో ఉందనే చెప్పాలి. అలాగే ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన జాన్వీ కపూర్ తన నటనలో పరిమితిని చూపించింది కొన్ని సన్నివేశాలలో తన తల్లి శ్రీదేవిని గుర్తు చేసిందని కూడా అంటున్నారు. అలాగే విలన్ గా సైఫ్ అలీ ఖాన్ కూడా భయపెట్టాడని ఎన్టీఆర్‌కు దీటుగా తన నటనతో మెప్పించాడు. ఇలా ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి క్యారెక్టర్ సినిమాకి అనుగుణంగా ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని సినిమా చూసిన యూఎస్ అభిమానులు అంటున్నారు.
టెక్నికల్:
ఈ సినిమాలోని టెక్నికల్ విషయానికొస్తే ముందుగా మ్యూజిక్ విషయంలో అనిరుధ్ కొంతవరకు మెప్పించాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లోనే పెద్దగా పసులేదని కామెంట్లు బాగా వస్తున్నాయి. ఏదేమైనాప్పటికీ మొత్తంగా ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమాతో పూర్తిస్థాయిలో ప్రేక్షకుడిని అలరించబోతున్నాడు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎంతో రిచ్‌గా ఉన్నాయి. మొత్తంగా దేవర సినిమాతో భారీ హీట్ కొట్టబోతున్నాడు.