Moviesదేవర‌లో ఈ హీరోయిన్ జాన్వీ కన్నా సో లక్కీ..!

దేవర‌లో ఈ హీరోయిన్ జాన్వీ కన్నా సో లక్కీ..!

మరి కొన్ని గంటల్లో ఎన్టీఆర్ దేవర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు 5 సంవత్సరాలకు పైగా ఎదురు చూసిన ఎన్టీఆర్ అభిమానుల కల నెరవేరబోతుంది. ఇక ఈ సినిమా విడుదలకు ముందే ఎన్నో సంచలన రికార్డులు క్రియేట్ చేసింది. ఇదే క్రమంలో సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం ఎన్టీఆర్ ఇండియన్ బాక్సాఫీస్ పై సరికొత్త రికార్డులు క్రియేట్ చేయటం మాత్రం పక్కా.

ఇదే క్రమంలో ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌కు మ‌త్ర‌మే చూస్తున్నారు. కానీ ఇందులో పెద్ద ఎన్టీఆర్ పక్కన నటించిన మరో అమ్మాయి కూడా అంతే అదృష్టవంతురాలని గుర్తించడం లేదు. తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్న తారక్ కు తల్లిగా నటిస్తున్న ఆర్టిస్టు పేరు శృతి మరాఠి. అలాని జుట్టుకి తెల్లరంగు వేసుకుని వయసు మళ్ళిన దానిగా మాత్రమే కనిపించబోవడం లేదు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కీలకమైన దేవర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో జూనియర్ తో సమానంగా ఈమెకూ ప్రాధాన్యం దక్కిందట.

దేవర, వర ఇద్దరితోనూ కాంబినేషన్ సీన్లున్న ఆర్టిస్టుల్లో శ్రీకాంత్, సైఫ్ అలీ ఖాన్ తర్వాత శృతి మరాఠి పేరు వినిపిస్తోంది. శృతిది గుజరాతి. పలు హిందీ, మరాఠి సినిమాలు, సిరీస్, సీరియళ్లలో సపోర్టింగ్ రోల్స్ చాలా చేసింది. సౌత్ డెబ్యూ దేవరతో జరుగుతోంది. దేవర హిట్ అయితే మాత్రం జాన్వితో పాటు శృతికి కూడా టాలీవుడ్ లో అవకాశాలు వస్తాయని అంటున్నారు. ఇక మరి శృతి తన నటనతో ప్రేక్షకులను ఏమాత్రం మపిస్తుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news