Movies' దేవ‌ర ' అడ్వాన్స్ బుకింగ్స్ @ రు. 50 కోట్లు.....

‘ దేవ‌ర ‘ అడ్వాన్స్ బుకింగ్స్ @ రు. 50 కోట్లు.. తార‌కో ఏందీ అరాచ‌కం..!

దేవర సినిమా తొలిభాగం థియేటర్లలో దిగేందుకు మరో రెండు రోజుల టైం ఉంది. దేవర అధికారికంగా ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్నా.. 26వ తేదీ గురువారం అర్ధరాత్రి దాటినప్పటి నుంచి దేవర బెనిఫిట్ షోలు పడిపోనున్నాయి. రిలీజ్‌కు రెండు రోజుల ముందు దేవర క్రియేట్ చేసిన రికార్డులు చూస్తుంటే.. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఇప్పటికే దేవర మూవీ అమెరికాలో కేవలం ప్రీమియర్ షోస్.. ప్రీ సేల్స్ అమ్మకాల ద్వారా రెండు మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ కూడా అధికారికంగా వెల్లడించింది.

Devara: Part 1 Movie: Review | Release Date (2024) | Songs | Music | Images  | Official Trailers | Videos | Photos | News - Bollywood Hungama
రిలీజ్ రోజు పూర్తయ్యేసరికి దేవర వసూళ్లు నాలుగు మిలియన్ డాలర్లకు చేరువ అయిన ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ఇప్పుడు ఎన్టీఆర్ సోలో సినిమా దేవర కూడా రిలీజ్ కి ముందే రెండు మిలియన్ డాలర్ల క్లబ్లో చేరి అరదైన రికార్డు నమోదు చేసింది. అయితే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దేవర రిలీజ్ అయ్యేందుకు మరో రెండు రోజులు టైం ఉండగానే.. 50 కోట్ల గ్రాస్ అడ్వాన్స్ వసూళ్లు సాధించింది. ఇది నిజంగా మామూలు రికార్డు కాదనే చెప్పాలి. ఇది ఓ సెన్సేషనల్ రికార్డు దేవర.

Devara Release Date Update: Jr NTR Film Gets Delayed Due To VFX Work |  Devara Part 1 Release Delay Reason | Devara Part 1 New Release Date And  Star Cast Details - Filmibeat
సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయి.. ఎన్టీఆర్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పేందుకు ఈ వసూళ్లు పెద్ద నిదర్శనం. రిలీజ్ కు మరో రెండు రోజులు టైం ఉండగానే కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రూ.50 కోట్ల వసూళ్లు అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఇక తొలిరోజు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అర్ధరాత్రి దేవర సినిమాను స్పెషల్ ప్రీమియర్ షోలు వేసుకునేందుకు రెండు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే అటు ఆంధ్రప్రదేశ్లోనూ.. ఇటు తెలంగాణలోనూ దేవర సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు కూడా ప్రభుత్వం నుంచి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక ఎన్టీఆర్ మాస్ ర్యాంపేజ్‌ బాక్స్‌ఆఫీస్ దగ్గర చూడటం ఒకటే మిగిలి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news