ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి దిగనుంది. ‘దేవర’ సినిమాకు ప్రస్తుతం ఎలాంటి హైప్ క్రియేట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దేవర సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు, అదనపు షోలు వేసుకునేందుకు గ్రీన్‌సిగ్నల్స్ ఇచ్చేశాయి. ఇక రిలీజ్ డే నాడు మిడ్నైట్ షోతో పాటు మరో 6 షోలు వేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక రెండో రోజు నుంచి 5 షోలు వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
ఏపీతో పోలిస్తే తెలంగాణలో టిక్కెట్ రేట్లు తక్కువుగా ఉన్నాయి. తొలి రోజు తెలంగాణలో టికెట్ రేట్లు రూ.100 పెంచుకోవచ్చని.. రెండో రోజు నుంచి సింగిల్ స్క్రీన్‌లో రూ.25, మల్టీప్లెక్స్‌లో రూ.50 పెంచుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకం అయిన మహేష్‌బాబు ఏఎంబీ మాల్లో దేవర దుమ్ము దులిపేసింది. రికార్డులు షేక్ చేసింది. ఈ రోజు అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్స్ అలా ఓపెన్ అయ్యాయో లేదో తొలి రోజు 27 షోల టిక్కెట్లు కేవలం అరగంటలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
అటు అల్లు అర్జున్ ఏఏఏ మాల్లో గంటన్నర తర్వాత కూడా చాలా షోలకు ఖాళీగా ఉన్నాయి. ఏఎంబీలో మాత్రం కేవలం అరగంటలో 27 షోలు వాష్ అవుట్ అయిపోయాయి. దీనిని బట్టి ఏఎంబీలో ఎన్టీఆర్ దేవర సినిమాను చూసేందుకు హైదరాబాద్ సినీ లవర్స్ ఎంత ఆతృతతో వెయిట్ చేస్తున్నారో తెలుస్తోంది. ఏదేమైనా ఎన్టీఆర్ ఊరమాస్ ర్యాంపేజ్‌కు దేవర సాక్ష్యంగా నిలవబోతోంది.