బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 సరికొత్త గేమ్ ప్లాన్ తో ఇంట్రెస్టింగ్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షో మూడు వారాలను కంప్లీట్ చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా.. మొదటి వారం బేబక్క, రెండో వారం శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడో వారం సిద్దిపేట పోరడు అబ్బాయి నవీన్ ఇంటి బాట పట్టాడు.
బిగ్ బాస్ హౌస్ లో నెలదొక్కుకోవాలంటే ఆటతీరు లేదా మాట తీరుతో అయినా ఆకట్టుకోవాలి. కానీ ఈ రెండు విషయాల్లో అభయ్ ఫెయిల్ అయ్యాడు. అదృష్టం కొద్దీ మూడో వారం చీఫ్ గా ఎంపికైన అభయ్.. తన కో-చీఫ్ అయిన నిఖిల్ తో పోటీపడి మరీ సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. ఏ ముహూర్తాన చీఫ్ అయ్యాడో కానీ అప్పటినుంచి అతనిలో నిర్లక్ష్యం, ధిక్కార ధోరణి పురుడు పోసుకున్నాయి.
ఇచ్చిన టాస్కులను సరిగ్గా ఆడక పోవడానికి తోడు పదేపదే బిగ్ బాస్ ను నిందించడం అభయ్ కు పెద్ద మైనస్ గా మారింది. అతని తీరుకు ఆగ్రహించిన నాగార్జున శనివారం రెడ్ కార్డ్ చూపించినప్పటికీ.. తోటి కంటెస్టెంట్స్ ప్రాధేయపడడంతో హౌస్ లో ఉండేందుకు హోస్ట్ ఒప్పుకున్నారు. అయితే రెడ్ కార్డ్ నుంచి తప్పించుకున్నప్పటికీ ఆదివారం ఎలిమినేషన్ నుంచి అభియ్ తప్పించుకోలేకపోయాడు.
ఓటింగ్ తక్కువగా ఉండటం వల్ల మూడో వారం అతను ఎలిమినేట్ అయ్యాడు. ఇక మూడు వారాలకు గాను బిగ్ బాస్ హౌస్ లో అభయ్ రూ. 6 లక్షల వరకు సంపాదించాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వారానికి అభయ్ రెమ్యునరేషన్ రూ. 2 లక్షలు అని సమాచారం.