Moviesవాట్‌.. డ్యాన్స్ లో కింగ్ అయిన ఎన్టీఆర్ కు అస‌లు డ్యాన్సే...

వాట్‌.. డ్యాన్స్ లో కింగ్ అయిన ఎన్టీఆర్ కు అస‌లు డ్యాన్సే న‌చ్చ‌దా..?

దేవ‌ర‌.. దేవ‌ర‌.. దేవ‌ర‌.. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అనంర‌తం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న చిత్ర‌మిది. కొర‌టాల శివ ద‌ర్శ‌కుడు కాగా.. శ్రీ‌దేవి కూతురు జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ను పోషించాడు. అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన దేవ‌ర రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. పార్ట్‌-1 సెప్టెంబ‌ర్ 27న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌బోతోంది.

ఈ నేప‌థ్యంలోనే సౌత్ తో పాటు నార్త్ లో దేవ‌ర మూవీని ఎన్టీఆర్ చిత్ర‌టీమ్ తో క‌లిసి గ‌ట్టిగా ప్ర‌మోట్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం చెన్నైలో ఉన్న ఎన్టీఆర్‌.. తాజాగా ఓ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ లో డ్యాన్స్ గురించి మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. యాక్టింగ్ ప‌రంగా, డైలాగ్ డెలివ‌రీ ప‌రంగానే కాకుండా ఒక అద్భుత‌మైన డ్యాన్స‌ర్ గా కూడా ఎన్టీఆర్ పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నాడు. నెం.1 డ్యాన్స‌ర్ గా గుర్తింపు పొందాడు.

అయితే డాన్స్ లో కింగ్ అయిన ఎన్టీఆర్ కు అస‌లే డ్యాన్స్ చేయ‌డ‌మంటేనే న‌చ్చ‌ద‌ని మీకు తెలుసా..? అవును మీరు విన్న‌ది నిజ‌మే. ఈ విష‌యాన్ని ఎన్టీఆర్ స్వ‌యంగా రివీల్ చేశాడు. డ్యాన్స్‌ చేయాలంటే నాకు విసుగు వస్తుంది. డైలాగ్, యాక్టింగ్ పార్ట్ టైమ్ లో మాత్ర‌మే నేను హ్యాపీగా ఉంటాను. నాకు అవే ఇష్టం. డ్యాన్స్ అంటే అంతగా ఇష్టం ఉండదు అంటూ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

ఇంకా మాట్లాడుతూ.. డ్యాన్స్ డ్యాన్స్ లాగే ఉండాలి. అదేదో ఫైట్ లేదా జిమ్నాస్టిక్స్ లాగా ఉండ‌కూడ‌దు. సులువుగా చేసేయాలి. విజయ్ సర్ లాగా. ఆయ‌న కూల్ గా ఉంటూనే చాలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు. అందుకే విజ‌య్ డ్యాన్స్ కు నేను వీరాభిమానిని అని ఎన్టీఆర్ తెలిపాడు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news