అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ తెలుగు సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. సౌత్ లో డెబ్యూ మూవీనే ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించే అవకాశాన్ని జాన్వీ దక్కించుకుంది. వీరిద్దరూ జంటగా యాక్ట్ చేసిన చిత్రం దేవర. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
ఇప్పటికే బయటకు వచ్చిన ప్రచార చిత్రాలు, సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ప్రమోషన్స్ ద్వారా చిత్రబృందం మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమలో ఎన్టీఆర్ దేవరకు సంబంధించి అనేక విషయాలను పంచుకున్నారు. బెస్ట్ అవుట్‌పుట్ కోసం టీమ్ అంతా ఎంతగానో శ్రమించామని.. అందుకే సినిమాపై అందరికీ చాలా నమ్మకం ఉందని ఎన్టీఆర్ తెలిపాడు.
టైటిల్ గురించి మాట్లాడుతూ.. దేవర అంటే దేవుడు అని అర్థం. ఆర్ఆర్ఆర్ మాదిరిగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువయ్యే టైటిల్ పెట్టాలని అనుకున్నాం. ఆ ఆలోచనతోనే దేవర టైటిల్ ఫిక్స్ చేశామని ఎన్టీఆర్ తెలిపారు. ఇక ఈ క్రమంలోనే దేవర సినిమాకు జాన్వీ కపూర్ ను రికమండ్ చేసిందెవరో కూడా ఎన్టీఆర్ రివీల్ చేశాడు.
వాస్తవానికి హీరోయిన్గా జాన్వీ కపూర్ ను తీసుకోవాలని తాము తొలుత అనుకోలేదు. కథ రాస్తున్నప్పుడు కథానాయికగా ఎవరిని ఎంచుకోవాలనే విషయంలో ఎలాంటి ఆలోచన లేదు. ఆ టైమ్ లోనే కరణ్ జోహార్ నుంచి కాల్ వచ్చింది. జాన్వీ మంచి నటి. ఆమెను మన సినిమాలో తీసుకుంటే బాగుంటుందని చెప్పారు. జాన్వీ కూడా దేవరలో యాక్ట్ చేయాలని బలంగా కోరుకున్నారు. స్క్రిప్ట్ పూర్తయ్యే సమయానికి ఆమె మా టీమ్‌లోకి వచ్చారు. యాక్టింగ్, బాష విషయంలో మొదట జాన్వీ కంగారు పడినా కూడా ఆ తర్వాత చక్కగా యాక్ట్ చేశారంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి దేవర సినిమాకు జాన్వీని కరణ్ రికమండ్ చేశాడనే సీక్రెట్ ను ఎన్టీఆర్ ఓపెన్ గా చెప్పేశాడు.