సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య పోటీ తత్వం మాత్రమే కాదు ఈర్ష్య, పగ, అసూయ వంటివి కూడా ఉంటాయి. ఒక హీరోయిన్ కి ఎక్కువ అవకాశాలు వస్తే మరో హీరోయిన్ అస్సలు ఓర్చుకోదు.ఎంతో కుళ్ళుకుంటుంది. ఇక ఆ హీరోయిన్ కంటే ఎక్కువ అవకాశాలు రావడం కోసం ఎంతటికైనా వెళ్తుంది. కానీ కొంతమంది హీరోయిన్లు అలా ఉండరు. అయితే ఒక హీరోయిన్ కి మరో హీరోయిన్ కి మధ్య స్నేహం ఉండొచ్చు అసూయ కూడా ఉండొచ్చు అది కామన్.
కానీ కాజల్ అగర్వాల్ మాత్రం ఓ హీరోయిన్ ని చాలా దారుణంగా అవమానించిందట. మరి ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు కాజల్ అంతలా ఆమెను అవమానించాల్సి వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.. కాజల్ అగర్వాల్ అవమానించింది ఎవర్నో కాదు తమన్నానే..అయితే గతంలో తమన్నా నేను పారితోషికం ఆకర్షణయంగా ఉంటే అది చిన్న రోలైన,ఐటమ్ సాంగ్ అయినా,లిప్ లాక్ సన్నివేశమైనా సరే నటించడానికి ఓకే చెబుతాను అని ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది.
అయితే ఇదే విషయంపై కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. నేను అందరిలాంటి దాన్ని కాదు.. డబ్బు కోసం కక్కుర్తి పడి ఎలాంటి పాత్రనైనా ఒప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు.. డబ్బు ఇస్తే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి నేను ముందుకు రాను. నాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి..అంటూ పరోక్షంగా తమన్నాని ఉద్దేశించి కాజల్ మాట్లాడిందట. అయితే కాజల్ ఆ మాటలు మాట్లాడడానికి కారణం ఓ సీనియర్ హీరో సినిమాలో కాజల్ కి అవకాశం వచ్చిందట. కానీ కాజల్ మాత్రం ఆ హీరో సినిమాలో నేను సెట్ కాను. ఆ హీరోకి నాకు మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటుంది అని రిజెక్ట్ చేసిందట.
కానీ అంతకుముందే చిరంజీవి నటించిన 150 వ సినిమా ఖైదీ నెంబర్ 150 లో హీరోయిన్ గా చేసింది. కానీ ఆ తర్వాత మరో సీనియర్ హీరో మూవీలో అవకాశం వస్తే మాత్రం నాకు ఆ హీరోకి సెట్ అవ్వదు అంటూ రిజెక్ట్ చేసిందట. ఇక ఆ టైంలోనే తమన్నా గురించి ఇలా పరోక్షంగా డబ్బు కోసం నేను ఎవరితోనైనా ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటించడానికి రెడీగా లేను అని చెప్పింది.అలా ఆరోజు కాజల్ అగర్వాల్ మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది కాజల్ తమన్నా మీద అసూయతోనే ఇలా పరోక్ష కామెంట్లు చేసిందని ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకున్నారు.