Moviesస్టార్ హీరోకు త‌న ఇంటిని అమ్మేసిన త్రిష‌.. కార‌ణం ఏంటంటే..?

స్టార్ హీరోకు త‌న ఇంటిని అమ్మేసిన త్రిష‌.. కార‌ణం ఏంటంటే..?

సుధీర్గ కాలం నుంచి తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న ముద్దుగుమ్మ‌ల్లో చెన్నై సోయ‌గం త్రిష ఒక‌రు. నాలుగు ప‌దుల వ‌య‌సులోనూ చేతి నిండా సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది. సౌత్ లో హైయ్యెస్ట్ పెయిడ్ యాక్ట్ర‌స్ గా స‌త్తా చాటుతోంది. అటువంటి త్రిష త‌న ఇంటిని ఒక సీనియ‌ర్ స్టార్ హీరోకు అమ్మేసింద‌ట‌. ఇంత‌కీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు యాక్షన్ చిత్రాలకు పెట్టిందిపేరైన భాను చందర్. ప్ర‌స్తుతం త్రిష ఇంట్లో భాను చంద‌ర్ ఉంటున్నాడట‌.

అయితే భాను చంద‌ర్ కు త్రిష ఇల్లు అమ్మింది ఇప్పుడు కాదండోయ్‌.. చాలా ఏళ్ల క్రిత‌మే ఇది జ‌రిగింది. చెన్నై నుంచి టాలీవుడ్ హైదరాబాదుకు షిఫ్ట్ అయినా కూడా కొందరు నటీన‌టులు చెన్నైలోనే ఉండిపోయారు. అలాంటివారిలో భానుచందర్ ఒకరు. ప్ర‌స్తుతం చెన్నైలో భాను చందర్ ఉంటున్న ఇల్లు స్టార్ హీరోయిన్ త్రిషది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు త‌న ఇంటిని చూపిస్తూ భాను చంద‌ర్ స్వ‌యంగా ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు.

త్రిష హీరోయిన్ గా అప్పుడ‌ప్పుడే ఎదుగుతున్న రోజుల‌వి. ఆ టైమ్ లో త్రిష తండ్రికి వ్యాపారం లో పెట్టుబడి పెట్టడానికి డబ్బు అవసరమై రావ‌డంతో.. న‌టుడు భాను చంద‌ర్ కు ఇంటిని అమ్మ‌డం జ‌రిగింది. ఆ త‌ర్వాత త్రిష ఇంటిని భాను చందర్ స‌తీమ‌ణి ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఇంటి చుట్టూ పూలమొక్కలతో పచ్చదనాన్ని పరిచారు. ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని సృష్టించారు.

ఇక ఎప్పుడన్నా త్రిష కనిపిస్తే.. మా ఇల్లు ఎలా ఉంది? అని అడుగుతుందని ఇంట‌ర్వ్యూలో భాను చంద‌ర్ చెప్పుకొచ్చారు. అలాగే గతంలో త్రిష బెడ్రూం, ఇప్పుడు తన బెడ్రూం అయిందని తెలిపారు. త్రిష ఇల్లు త‌మ‌కు బాగా క‌లిసొచ్చింద‌ని కూడా ఆయ‌న అన్నారు. కాగా, భాను చంద‌ర్ కు త్రిష అమ్మేసిన ఇంటి విలువ ప్ర‌స్తుతం రూ. 8 కోట్లు ఉంటుంద‌ని స‌మాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news