Moviesహాట్ టాపిక్ గా మోక్షజ్ఞ రెమ్యున‌రేష‌న్‌.. మొద‌టి సినిమాకే అంతిస్తున్నారా..?

హాట్ టాపిక్ గా మోక్షజ్ఞ రెమ్యున‌రేష‌న్‌.. మొద‌టి సినిమాకే అంతిస్తున్నారా..?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ వార‌సుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ తేజ సినీ రంగ ప్ర‌వేశం చేసిన సంగ‌తి తెలిసిందే. వారం రోజుల క్రితం మోక్ష‌జ్ఞ డెబ్యూపై తొలి ప్ర‌క‌ట‌న విలువ‌డింది. యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ నంద‌మూరి వార‌సుడిని వెండితెర‌కు ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడు.

నందమూరి మోక్షజ్ఞ – ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాను ఎస్‌ఎల్వీ సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నందమూరి తేజస్విని సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం కాబోతోంది. మోక్షజ్ఞ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 6న అత‌ని ఫ‌స్ట్ లుక్ ను చిత్ర‌బృందం విడుద‌ల చేయ‌గా.. విశేష‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది.

ఇదిలా ఉంటే.. మొద‌టి సినిమాకు మోక్షజ్ఞ అందుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కు టాలీవుడ్ లో స్టార్ హీరోల వార‌సులైనా కూడా త‌న డెబ్యూ మూవీకి చాలా త‌క్కువ పారితోషికం తీసుకున్నారు. కొంద‌రైతే మొదటి సినిమాకు ఎలాంటి రెమ్యున‌రేష‌న్ ఆశించేవారు కాదు. సినిమా సక్సెస్‌ అయ్యాకే లాభాల్లో ఎంతో కొంత తీసుకునేవారు. కానీ మోక్ష‌జ్ఞ మాత్రం అందుకు పూర్తిగా భిన్నమ‌ని నిరూపించుకుంటున్నాడు.

ఫ‌స్ట్ మూవీకే మోక్ష‌జ్ఞ ఏకంగా రూ. 20 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేస్తున్నాడ‌ని.. నిర్మాత సుధాకర్‌ చెరుకూరి సైతం అంత మొత్తం ఇచ్చేందుకు ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌డం లేద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మ‌న్న‌ది స్ప‌ష్ట‌త లేదు. కొంద‌రు నెటిజ‌న్లు మాత్రం మొద‌టి సినిమాకే అంతిస్తున్నారా? అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇంకొంద‌రు అందంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news