Moviesఇన్‌స్టాలో 12 ల‌క్ష‌ల‌కు పైగా ఫాలోవ‌ర్స్‌.. కానీ ప్ర‌భాస్ ఫాలో అయ్యేది...

ఇన్‌స్టాలో 12 ల‌క్ష‌ల‌కు పైగా ఫాలోవ‌ర్స్‌.. కానీ ప్ర‌భాస్ ఫాలో అయ్యేది మాత్రం ఈ 23 మందినే..!

ఇండియ‌న్ బాక్సాఫీస్ కింగ్‌, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. స‌లార్‌, క‌ల్కి చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ అందుకున్న ప్ర‌భాస్‌.. ఇప్పుడు స‌లార్ 2, క‌ల్కి 2, మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రాజాసాబ్ వంటి చిత్రాలు చేస్తూ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్నాడు. వీటిలో రాజాసాబ్ వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌బోతోంది. కెరీర్ లోనే తొలిసారి ప్ర‌భాస్ హార‌ర్ కామెడీ నేప‌థ్యంలో చేస్తున్న చిత్ర‌మిది.

అలాగే సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే యాక్ష‌న్ ఫిల్మ్‌, హ‌ను రాఘ‌వ‌పూడి డైరెక్ష‌న్ లో ఓ చిత్రం చేసేందుకు ప్ర‌భాస్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. సినిమాల గురించి ప‌క్క‌న పెడితే.. ప్ర‌భాస్ బ‌య‌ట పెద్ద‌గా క‌నిపించ‌డు. అలాగే సోష‌ల్ మీడియాలో కూడా ఏమాత్రం యాక్టివ్ గా ఉండ‌డు. సినిమాల‌ను ప్ర‌మోట్ చేసుకోవ‌డానికి మిన‌హా మ‌రేత‌ర విష‌యాలను మ‌న డార్లింగ్ సోష‌ల్ మీడియాలో పంచుకున్న‌ది లేదు.

అయిన‌ప్ప‌టికీ ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్ బుక్‌, ఎక్స్‌(ట్విట్ట‌ర్‌) త‌దిత‌ర సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌భాస్ కు భారీ సంఖ్య‌లో ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాలో ప్ర‌భాస్ ను ఏకంగా 12.8 మిలియ‌న్ మెంబ‌ర్స్ ఫాలో అవుతున్నారు. అయితే 12 ల‌క్ష‌ల‌కు పైగా ఫాలోవ‌ర్స్ ను క‌లిగి ఉన్న ప్ర‌భాస్‌.. ఇన్‌స్టాలో కేవ‌లం 23 మందిని ఫాలో అవుతున్నారు. ఈ జాబితాలో మొద‌ట క‌నిపించే పేరు ప్ర‌భాస్ పెద్దనాన్న దివంగత హీరో కృష్ణంరాజు.

అలాగే డైరెక్ట‌ర్స్ నాగ్ అశ్విన్‌, ఓం రౌత్‌, మారుతి, హ‌ను రాఘ‌వ‌పూడి, సందీప్ రెడ్డి వంగా, రాధేశ్యామ్ ఫేమ్ రాధాకృష్ణ‌, సుజీత్‌ ల‌ను ప్ర‌భాస్ ఫాలో అవుతున్నాడు. వీరితో పాటు గ్లోబల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్, క‌న్న‌డ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, బాలీవుడ్ న‌టుడు స‌న్నీ సింగ్, హీరోయిన్ శృతి హాస‌న్‌, కృతి స‌న‌న్‌, దీపికా పదుకొణే, న‌టి రిద్ధీ కుమార్, శ్ర‌ద్ధా క‌పూర్, పూజా హెగ్డే, సీనియ‌ర్ న‌టి భాగ్య‌శ్రీ‌, నిధి అగ‌ర్వాల్, మాళ‌విక మోహ‌న్‌, యంగ్ హీరోయిన్ ఇమాన్వి, ఫిల్మ్ యాక్షన్ యూనిట్ ఎడిటర్ డిబి బ్రాకమోంటెస్ లు ప్ర‌భాస్ ఫాలో అవుతున్న లిస్ట్ లో ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news