మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, జూనియర్ అతిలోక సుందరి జాన్వీ కపూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ దేవర. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. దేవర సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తుండగా.. పార్ట్ 1 సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రంపై నేషనల్ వైడ్ గా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ తాజాగా చిత్రబృందం దేవర పార్ట్ 1 ట్రైలర్ ను లాంచ్ చేసింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం ముంబైలో అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, డైరెక్టర్ కొరటాల శివతో పాటు పలువురు పాల్గొని సందడి చేశారు. ఇదిలా ఉంటే.. దేవర ప్రమోషన్స్ ప్రస్తుతం ముంబైలో జోరుగా సాగుతున్నాయి. అయితే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ ఈవెంట్ కోసం జాన్వీ కపూర్ చీరలో దర్శనమిచ్చింది. ఎంబ్రాయిడరీ బ్లౌజ్ మరియు పింక్ శారీలో ఆమె ప్రిన్సెస్ లా మెరిసిపోయింది.
అయితే దేవర ప్రమోషనల్ ఈవెంట్ లో జాన్వీ కపూర్ కట్టిన గులాబీ రంగు చీర ఖరీదెంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు. నచికేత్ బ్రావే డిజైన్ ఆ పింక్ కలర్ చీర ఖరీదు అక్షరాల రూ. 1,24,850. అలాగే పింక్ శారీకి పెయిర్ అప్ గా చెవులకు జాన్వీ పెట్టుకున్న ఇయర్ రింగ్స్ ధర రూ. 13 లక్షలు. ఈ విషయం తెలిసి నెటిజన్లు నోరెళ్లబడుతున్నారు. కాగా, తెలుగులో జాన్వీ కపూర్ కు దేవరనే తొలి చిత్రం. ఈ మూవీ విజయవంతమైతే సౌత్ లో ఆమె దశ తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.