Moviesవిజ‌య్ గోట్‌లో త్రిష ఐటెం సాంగ్‌.. రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే మ‌తిపోతుంది..!

విజ‌య్ గోట్‌లో త్రిష ఐటెం సాంగ్‌.. రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే మ‌తిపోతుంది..!

కోలీవుడ్ స్టార్ విజ‌య్ ద‌ళ‌ప‌తి న‌టించిన తాజా చిత్రం ది గోట్‌(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంక‌ట్ ప్ర‌భు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో విజ‌య్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభిన‌యం చేశాడు. మీనాక్షి చౌద‌రి, స్నేహ హీరోయిన్లుగా న‌టించారు. భారీ అంచ‌నాల న‌డుమ సెప్టెంబ‌ర్ 5న విడుద‌లైన గోట్ మూవీ.. ప్రేక్ష‌కుల‌ను నుంచి మిశ్ర‌మ స్పంద‌న సొంతం చేసుకుంది. అయితే విజ‌య్ కు ఉన్న క్రేజ్ నేప‌థ్యంలో త‌మిళంలో ఈ చిత్రం అదిరిపోయే రేంజ్ లో వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది.

తెలుగు మ‌రియు హిందీలో గోట్ కు అంతంత మాత్రంగా క‌లెక్షన్స్ వ‌స్తున్నాయి. ఇక‌పోతే ఈ సినిమాలో చెన్నై సోయ‌గం త్రిష ఐటెం సాంగ్ లో మెరిసిన సంగ‌తి తెలిసిందే. వెండితెర‌పై విజ‌య్‌, త్రిష‌ల‌ది హిట్ కాంబినేష‌న్‌. కోలీవుడ్ లో వీరిద్ద‌రూ జంట‌గా అనేక విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించారు. విజ‌య్ గ‌త చిత్రం లియోలో కూడా త్రిష హీరోయిన్‌గా న‌టించింది. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన లియో బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 600 కోట్ల రేంజ్ లో క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

హిట్ సెంటిమెంట్ ను రిపీట్ చేయ‌డం కోసం గోట్ లో త్రిష చేత మట్ట అనే స్పెష‌ల్ సాంగ్ చేయించారు. అయితే ఈ సాంగ్ కు త్రిష తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే మ‌తిపోతుంది. మూడున్న‌ర నిమిషాలు ఉన్న మ‌ట్ట సాంగ్ లో త్రిష విజ‌య్ తో క‌లిసి మ‌హా అయితే రెండు నిమిషాలు స్టెప్పులు వేసింది. ఆ రెండు నిమిషాల కోసం త్రిష ఏకంగా రూ.1.2 కోట్లు పారితోషికం పుచ్చుకుంద‌ట‌. హీరోయిన్లుగా న‌టించిన మీనాక్షి, స్నేహ కన్నా త్రిష రెమ్యున‌రేష‌న్‌నే ఎక్కువ‌ని కోలీవుడ్ ఫిల్మ్ స‌ర్కిల్స్ లో జోరుగా చ‌ర్చించుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news