మిల్కీ బ్యూటీ తమన్నా అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. సౌత్ తో పాటు నార్త్ లో నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న తమన్నా.. దాదాపు రెండు దశాబ్దాల నుంచి హీరోయిన్ గా వరుస సినిమాల్లో నటిస్తోంది. వెబ్ సిరీస్లు, ఐటెం సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. మరోవైపు బ్రాండ్ ప్రమోషన్స్, సొంతంగా వ్యాపారాలు చేస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తోంది. కానీ ఇంత వరకు పెళ్లి చేసుకోలేదు.
గత రెండేళ్ల నుంచి బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది. వీరిద్దరూ రేపో మాపో పెళ్లి చేసుకోవడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. అయితే తమన్నా మాత్రం పెళ్లి ప్రస్థావన తెచ్చిన ప్రతిసారి ఇంట్రెస్ట్ లేదని తేల్చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా తొలిసారి తన బ్రేకప్ స్టోరీస్ గురించి రివీల్ చేసింది. రెండుసార్లు తన హృదయం ముక్కలైందని తమన్నా చెప్పుకొచ్చింది.
టీనేజ్ లో ఉన్నప్పుడే నాకు ఫస్ట్ హార్ట్ బ్రేక్ అయింది. నాకెంతో బాధగా అనిపించింది. లైఫ్ లో ఏదో సాధించాలని.. కొత్త విషయాలను అన్వేషించాలని నా భావన. ఒక వ్యక్తి కోసం నచ్చిన జీవితాన్ని వదులుకోవడం నచ్చలేదు. అందుకే ఫస్ట్ బ్రేకప్ జరిగింది. ఆ తర్వాత మరొక వ్యక్తితో కొన్నాళ్లు రిలేషన్ లో ఉన్నా. కానీ అతను నాకు సెట్ కాలేదు. ప్రతి చిన్న విషయానికి అబద్ధం చెప్పేవారితో బంధాన్ని కొనసాగించడం ప్రమాదకరం. ఆ కారణంతోనే రెండోసారి బ్రేకప్ జరిగింది అంటూ తమన్నా చెప్పుకొచ్చింది. అయితే రెండుసార్లు తన హృదయాన్ని ముక్కలు చేసిందెవరు అన్నది మాత్రం తమన్నా రివీల్ చేయలేదు.