Moviesహీరో రానా పుట్టుక‌కు… బాల‌య్య సినిమాకు ఇంత లింక్ ఉందా… టాప్...

హీరో రానా పుట్టుక‌కు… బాల‌య్య సినిమాకు ఇంత లింక్ ఉందా… టాప్ సీక్రెట్ ఇది..!

నందమూరి నట‌సింహ బాలకృష్ణ 50 సంవత్సరాల వేడుకకు తెలుగు సినిమా రంగానికి చెందిన పలువురు సీనియర్ హీరోలు.. కుర్ర హీరోలు కూడా పాల్గొని బాలయ్యతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగు సినిమా రంగంలో నందమూరి ఫ్యామిలీకి… దగ్గుబాటి ఫ్యామిలీకి ఎంతో అనుబంధం ఉంది దివంగత లెజెండ్రీ నిర్మాత మూవీ మొగల్ దగ్గుబాటి రామానాయుడు నిర్మించిన ఎన్నో సినిమాలలో ఎన్టీ రామారావు హీరోగా నటించారు. ఎన్టీఆర్ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ కూడా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించారు.

ఈ క్రమంలోనే బాలయ్య 50 సంవత్సరాల వేడుక కార్యక్రమానికి దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో పాటు సురేష్ బాబు తనయుడు హీరో రానా కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే రానా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. బాలకృష్ణ గారు నటించిన ఒక సినిమా విడుదలైన రోజు తాను పుట్టానని.. అందుకే తాను కూడా బాలయ్య లాగే అల్లరి చేస్తూ ఉంటానని సరదాగా చెప్పారు. రానా వేదికల మీద సరదాగా ఆటపట్టిస్తూ అందరితోనూ అల్లరి గా చిలిపిగా వ్యవహరిస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే.

ఇక బాలయ్య సినిమా రిలీజ్ రోజు రానా పుట్టారన్న విషయం ఇన్నాళ్లకు రానా చెప్పడంతో బయటపడింది. ఇక మరో హీరో నాని మాట్లాడుతూ బాలకృష్ణని కలవడం మాత్రమే కాదు.. ఆయన దగ్గరగా చూసిన ఇష్టపడతా సర్ మీరు ఇలాగే మరో 100 సినిమాలు చేయాలని ఆకాంక్షించారు. బాలయ్య నటన ఆయన చేస్తున్న సేవ చూస్తూనే పెరిగా.. నాకు తెలిసి చాలామంది ఆయన నిర్వహిస్తున్న ఆసుపత్రిలో చికిత్స పొందారు.. నా లైగర్ సినిమా షూటింగ్లో ఆయనను తొలిసారి కలిసా అని టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తెలిపారు. ఇక మా అధ్యక్షుడు హీరో మంచి విష్ణు మాట్లాడుతూ బాలయ్య గారి గురించి చెప్పాలంటే సమయం సరిపోదు.. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అది నాన్నగారు మోహన్ బాబు … బాలయ్య అంకుల్ వల్లే.. బాలకృష్ణ చాలా అల్లరి చేస్తారు… ఆయన హృదయం స్వచ్ఛమైంది వైద్యరంగంలో ఆయన చేసిన అంత సేవ ఇంకెవరూ చేయలేదని తెలిపారు.

దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ బాలయ్య బాబు గురించి మాట్లాడటం అదృష్టం అనుకోవాలి ఆయన గురించి డైలాగ్స్ రాయాలంటే బాలయ్య గారి నుంచే పుట్టేస్తాయి.. బాడీ లాంగ్వేజ్ నుంచి వచ్చేస్తాయి నటుడు.. రాజకీయ నాయకుడు.. మానవత్వం ఉన్న మనిషి ఇలా అనేక రూపాల్లో ఉండటం ఆయనకే సాధ్యం అని తెలిపారు. సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ తాను బాలయ్య గారిని కలిసిన ఐదారు సార్లు కూడా చూసింది ఏంటంటే బాలయ్య గారు ఎవరితో అయినా నిజాయితీగా ఉంటే కచ్చితంగా ఇష్టపడతారు మీ అనుభవం అంత లేదు నా వయసు.. మీరేనా ఒక స్ఫూర్తి అని చెప్పారు. ఇక అల్లరి నరేష్ మాట్లాడుతూ బాలకృష్ణ గారు చాలా సరదామనిషి.. 50 ఏళ్ల వేడుకలు జరుపుకోవడం సంతోషమని తెలిపారు. ఇక అడ‌వి శేష్‌ మాట్లాడుతూ చిన్నప్పుడు బాలయ్య గారి పాటలకు డ్యాన్స్ చేసేవాళ్ళం.. ఈరోజు బాలయ్య గురించి మాట్లాడటం చాలా సంతోషం అని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news