నందమూరి బాలకృష్ణ .. నందమూరి వసుంధరది అన్యోన్య దాంపత్యం. మామూలుగా భర్త చాటు భార్యగానే ఉండే వసుంధర భర్త కోసం హిందూపురం నియోజకవర్గంలో బాగా కష్టపడుతున్నారు.. బాలయ్య హిందూపురంలో పోటీ చేసిన మూడు ఎన్నికల్లోను వసుంధర ఎంతో కష్టపడడంతో పాటు తన భర్త గెలుపు కోసం తన వంతుగా కృషి చేశారు. అలాగే హిందూపురం ప్రజల కోసం తాను ఉన్నాను అంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. వసుంధరా దేవిది కాకినాడ.. పెళ్లిచూపులలోనే ఒకరికొకరు నచ్చడంతో 1982లో వీరి పెళ్లయింది. ఇక తన భార్య వసుంధర గురించి బాలయ్య చెబుతూ ఆమె తన వృత్తిని.. తన కుటుంబాన్ని ఎంతో బాగా అర్థం చేసుకుందని.. తాను షూటింగ్‌లలో బిజీబిజీగా ఉంటే ఇంటిని పిల్లలని జాగ్రత్తగా చూసుకునేదని తెలిపారు.
తాను విదేశాలలో షూటింగ్ కి వెళ్ళినప్పుడు పనిలో పడి పిల్లలకి ఏమి కొనలేకపోయేవాడిని అని.. అయితే పిల్లలు మెచ్చుకోకుండా ఆమె కొన్ని బహుమతులను కొని కారులో పెట్టి ఎయిర్‌ఫోర్ట్‌కి పంపే వారట.. బాలయ్య ఇంటికి రాగానే తనే కారులో నుంచి గిఫ్ట్స్ తీసి నాన్న మీకేం తెచ్చారో చూడండి అని వాళ్లను మైమరిపించేవారట. అలా తనే నా పాత్రను చాలా సందర్భాలలో పోషించేదని.. నాకే సమస్య వచ్చినా నా భార్య చూసుకుంటుందని వసుంధర నాకు భార్యా మాత్రమే కాదు.. బెస్ట్ ఫ్రెండ్.. సలహాదారు.. మా ఇంటి ఫైనాన్స్ మినిస్టర్ కూడా అని బాలకృష్ణ తెలిపారు.
ఇక బాలకృష్ణ వసుంధర దంపతులకు మొత్తం ముగ్గురు సంతానం పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణిని తన మేనల్లుడు అయినా నారా లోకేష్ కి ఇచ్చి 2007లో వివాహం చేశారు. ప్రస్తుతం నారా లోకేష్ మంగళగిరి ఎమ్మెల్యేగా.. ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్లో మంత్రిగానూ ఉన్నారు. రెండో అమ్మాయి తేజస్విని భర్త విశాఖ ఎంపీ శ్రీ భరత్ కు భార్య అన్న విషయం తెలిసిందే. ఇక బాలయ్య ఏకైక వారసుడు నందమూరి మోక్షజ్ఞ వెండి తెరంగ్రేటం కోసం యావత్ తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ సినిమా ఈ ఇయర్‌లోనే ఉంటుందని బాలయ్య చెప్పిన సంగతి తెలిసిందే.