Moviesస‌రిపోదా శ‌నివారం 3 డేస్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 42 కోట్ల టార్గెట్...

స‌రిపోదా శ‌నివారం 3 డేస్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 42 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంత‌..?

ద‌స‌రా, హాయ్ నాన్న వంటి సూప‌ర్ హిట్స్ అనంత‌రం న్యాచుర‌ల్ స్టార్ నాని నుంచి రీసెంట్ గా వ‌చ్చిన చిత్రం స‌రిపోదా శ‌నివారం. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంతో ఎస్‌.జె సూర్య ప్ర‌తినాయ‌కుడు పాత్ర‌ను పోషించాడు. నాని స‌ర‌స‌న ప్రియాంక్ మోహ‌న్ న‌టించింది. ఆగ‌స్టు 29న రిలీజ్ అయిన స‌రిపోదా శ‌నివారం పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద మాస్ ర‌చ్చ చేస్తోంది. భారీ వ‌ర్షాల వ‌ల్ల తెలుగు రాష్ట్రాల్లో అనుకున్నంత‌ జోరు చూపించ‌క‌పోయినా.. మంచి వ‌సూళ్లు రాబ‌డుతోంది.

అమెరికాలో మాత్రం స‌రిపోదా శ‌నివారం చిత్రానికి భారీ రెస్పాన్స్ వ‌స్తోంది. విడుద‌లైన మూడు రోజుల్లోనే అక్క‌డ రూ. 7.55 కోట్ల రేంజ్‌లో క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 5.88 కోట్లు, రెండో రోజు రూ. 3.04 కోట్ల షేర్ వ‌సూల్ చేసిన స‌రిపోదా శ‌నివారం.. మూడో రోజు వీకెండ్ కావ‌డంతో రెండో రోజు మించి రూ. 4.63 కోట్లు షేర్ సొంతం చేసుకుంది.

స‌రిపోదా శ‌నివారం 3 డేస్ క‌లెక్ష‌న్స్ ను ప‌రిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.55 కోట్ల షేర్‌, రూ. 21.65 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. అలాగే మూడు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 24.65 కోట్ల షేర్‌, రూ. 45.15 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను కొల్ల‌గొట్టింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 42 కోట్లు కాగా.. ఇప్ప‌టివ‌ర‌కు 58 శాతం రికవ‌రీ అయింది. ఇంకా రూ. 17.35 కోట్ల షేర్ వ‌స్తే నాని ఖాతాలో హ్యాట్రిక్ హిట్ ప‌డ‌టం ఖాయ‌మ‌వుతుంది. కాగా, ఏరియాల వారీగా స‌రిపోదా శ‌నివారం మూడు రోజుల టోట‌ల్‌ క‌లెక్ష‌న్స్ ఈ విధంగా ఉన్నాయి..

నైజాం: 6.74 కోట్లు
సీడెడ్: 1.83 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 1.64 కోట్లు
తూర్పు: 64 ల‌క్ష‌లు
పశ్చిమ: 61 ల‌క్ష‌లు
గుంటూరు: 73 ల‌క్ష‌లు
కృష్ణ: 84 ల‌క్ష‌లు

నెల్లూరు: 52 ల‌క్ష‌లు

AP-TG మొత్తం = 13.55 కోట్లు(21.65 కోట్లు~ గ్రాస్‌)

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 3.55 కోట్లు

ఓవ‌ర్సీస్: 7.55 కోట్లు

వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్ = 24.65 కోట్లు(45.15 కోట్లు~ గ్రాస్)

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news