టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫిల్మ్ కెరీర్ లో చేసిన ప్రయోగాత్మక చిత్రాల్లో నిజం ఒకటి. తేజ రచించి దర్శకత్వం వహించి నిర్మించిన ఈ చిత్రంలో రక్షిత హీరోయిన్ గా నటించింది. గోపీచంద్ ప్రతినాయకుడి పాత్రను పోషించగా.. రాశి, రంగనాథ్, తాళ్ళూరి రామేశ్వరి, ప్రకాష్ రాజ్ తదితరురు ఇతర ముఖ్యమైన పాత్రను పోషించారు. చిత్రం మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు.
భారీ అంచనాల నడుమ 2003 మే 23న విడుదలైన నిజం మూవీ కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. కానీ ఎన్నో పురస్కారాలను అందుకుంది. ఉత్తమ నటుడిగా మహేష్ బాబు, ఉత్తమ సహాయ నటిగా తాళ్ళూరి రామేశ్వరి నంది అవార్డు అందుకున్నారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. నిజం మూవీకి ఫస్ట్ ఛాయిస్ మహేష్ బాబు కాదు. మొదట ఓ మెగా హీరోతో ఈ సినిమాను తీయాలని తేజ ప్లాన్ చేశారట.
ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకుల్లో ఒకరిగా సత్తా చాటుతున్న సమయంలో తేజ.. పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా తీయాలని భావించి నిజం స్టోరీని సిద్ధం చేసుకున్నారట. అయితే పవన్ కళ్యాణ్ కు కథ వినిపించగా.. ఆయనకు అస్సలు నచ్చలేదట. స్టోరీ బాగోలేదని తేజ ముఖంపై చెప్పేశాడు పవన్. ఆ తర్వాత తేజ అదే కథతో మహేష్ బాబును మెప్పించి సినిమా చేశాడు. కట్ చేస్తే సినిమా ఫ్లాప్ అయింది.