ఈ ఏడాది ప్రధమార్థంలో తెలుగు సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు. కల్కి నుంచి మళ్లీ మంచి ఊపు వచ్చింది. మిస్టర్ బచ్చన్, ఇస్మార్ట్ శంకర్ నిరాశపరిచినా.. సరిపోదా శనివారం సినిమా మంచి ఊపు తీసుకువచ్చింది. ఇక తెలుగు సినిమా మార్కెట్ రోజు రోజుకు పెరుగుతుంది. ఈ క్రమంలోనే రాబోతున్న రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలపై కనివిని ఎరిగిన రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా బాలీవుడ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఏకంగా రూ.100 కోట్లు కొల్లగొట్టింది.
ఈ సినిమా ఎందుకు నార్త్ జనాలకు కనెక్ట్ అయింది..? అక్కడ ప్రేక్షకులకు నచ్చిన పాయింట్లు ఏంటి..? ఇదంతా ఓ పెద్ద డిస్కషన్. పార్ట్ వన్ కు వచ్చిన బజ్ కారణంగా పార్ట్ 2 కు జరిగిన ఫ్రీ రిలీజ్ మార్కెట్ ఇప్పుడు ఇండియన్ సినిమాను షేక్ చేసి పడేస్తుంది. టాలీవుడ్ జనాలు పుష్ప 2 బిజినెస్ లెక్కలు చూసి షాక్ అవుతున్నారు. అన్ని భాషల ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్‌కు విక్రయించారు. ఇది రూ.275 కోట్ల డీల్ అని తెలుస్తోంది.
ఇది చాలా ఎక్కువ మొత్తం రికార్డ్. జస్ట్ రూ.200 కోట్ల అడ్వాన్స్ మీద పంపిణీకి ఇచ్చారు. ఇది రావాలి అంటే హిందీ వెర్షన్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. రూ.300 కోట్ల పైచిలుకు గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. ఇక అన్ని భాషలో ఆడియో రైట్స్ కలిపి రూ.60 కోట్లకు టీ సిరీస్‌కు విక్రయించారట. ఇది చాలా పెద్ద నెంబర్ అని చెప్పాలి. ఇక సౌత్ ఇండియా ఓవర్సీస్ థియేటర్ రైట్ ఎలా ఉండబోతున్నాయి..? అన్నది అంచనాలకు అందటం లేదు. ట్రేడ్ సమాచారం ప్రకారం ఆంధ్ర ఏరియా కు రూ.90 కోట్లు.. నిర్మాతలు కోడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
నైజాంకు కూడా ఈ రూ.90 కోట్లకు కాస్త అటు ఇటు గానే రేటు పలుకుతుందని అంటున్నారు. చాలా సులువుగా రూ.200 నుంచి రూ.300 కోట్ల మధ్యలో సౌత్ ఇండియా ఓవర్సీస్ రైట్స్ ఉండబోతున్నాయి. మొత్తం థియేటర్ ఫిగర్లు అన్నీ కలిపి.. సినిమా విడుదలయ్యాక ఉండే గ్రాస్ ఫిగర్లు ఊహించుకుంటుంటేనే అసలు పుష్ప 2 సినిమా రేంజ్ ఏ స్థాయిలో ఉండబోతుందో అర్థం అవుతుంది. డిసెంబర్ 6న విడుదలయ్య పుష్ప 2 రిలీజ్ ముందే ఎన్నో సంచలనాలకు కేంద్రబిందువుగా ఉండేలా కనిపిస్తోంది.