Moviesనాని వీర కుమ్ముడు.. స‌రిపోదా శ‌నివారం 2 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్...

నాని వీర కుమ్ముడు.. స‌రిపోదా శ‌నివారం 2 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

న్యాచుర‌ల్ స్టార్ నాని, ప్రియాంక మోహ‌న్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం స‌రిపోదా శ‌నివారం. డివివి దాన‌య్య నిర్మించిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కు వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రించాడు. ఎస్‌.జె సూర్య ఇందులో విల‌న్ గా న‌టించారు. భారీ అంచ‌నాల నడుమ శుక్ర‌వారం విడుద‌లైన స‌రిపోదా శ‌నివారం చిత్రానికి ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వ‌చ్చాయి.

అయితే తెలుగు రాష్ట్రాల్లో వ‌ర్షాల కార‌ణంగా మొదటి రోజు మరీ భీభత్సం కాక‌పోయినా ఉన్నంతలో ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. రెండో రోజు కూడా డీసెంట్స్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. అయితే ఓవ‌ర్సీస్ లో మాత్రం నాని వీర కుమ్ముడు కుమ్ముతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 5.88 కోట్ల షేర్‌, రూ. 8.85 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ స‌రిపోదా శ‌నివారం.. రెండో రోజు రూ. 3.04 కోట్ల షేర్‌, రూ. 5.10 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను అందుకుంది. అలాగే ఓవ‌ర్సీస్ లో రెండు రోజుల్లో నాని మూవీకి ఏకంగా రూ. 5.65 కోట్ల షేర్ వ‌చ్చింది.

వ‌ర‌ల్డ్ వైడ్ గా స‌రిపోదా శ‌నివారం 2 డేస్ లో రూ. 16.72 కోట్ల షేర్‌, రూ. 30.70 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను సొంతం చేసుకుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 41 కోట్ల రేంజ్ లో జ‌ర‌గ‌గా.. రూ. 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో నాని మూవీ బ‌రిలోకి దిగింది. ఈ లెక్క‌న మ‌రో రూ. 25.28 కోట్ల షేర్ వ‌స్తే సినిమా క్లీన్ హిట్ గా నిలుస్తుంది. కాగా, ఏరియాల వారీగా స‌రిపోదా శ‌నివారం రెండు రోజుల టోట‌ల్‌ క‌లెక్ష‌న్స్ ఈ విధంగా ఉన్నాయి..

నైజాం: 4.16 కోట్లు
సీడెడ్: 1.22 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 1.15 కోట్లు
తూర్పు: 47 ల‌క్ష‌లు
పశ్చిమ: 45 ల‌క్ష‌లు
గుంటూరు: 52 ల‌క్ష‌లు
కృష్ణ: 60 ల‌క్ష‌లు

నెల్లూరు: 36 ల‌క్ష‌లు

AP-TG మొత్తం = 8.92 కోట్లు(13.95 కోట్లు~ గ్రాస్‌)

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 2.15 కోట్లు

ఓవ‌ర్సీస్: 5.65 కోట్లు

వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్ = 16.72 కోట్లు(30.70 కోట్లు~ గ్రాస్)

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news